టెలివిజన్ చరిత్రలో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న గేమ్ షో బిగ్ బాస్.  మూడు వారాల నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ వారంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలతో మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న తమన్నా ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించారు. ఊహించినట్టుగానే తమన్నా ఇంటి నుండి వెళ్ళిపోయింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన తమన్నా రెండు వారాలు కూడా హౌస్ లో ఉండలేకపోయింది.


ట్రాన్స్ అయిన తమన్నా తన లాంటి వాళ్ళకి ఒక రోల్ మోడల్ లా నిలవాలనుకుంది. అయితే అది ఆమె ఎంతవరకు సాధించిందో అనుమానమే! ఈ నేపథ్యంలో తమన్నా మరోసారి ఇంట్లోకి అడుగు పెట్టనుందా అనే సందేహం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా నాగార్జున నువ్వు అనుకున్నది సాధించావా అని పదే పదే అడగడం.  ఛాన్స్ వస్తే మళ్ళీ ఇంట్లోకి వెళ్తావా అనడం వల్ల బిగ్ బాస్ లో మరో వైల్డ్ కార్డ్  ఉండబోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 


పోయిన సీజన్ లో నూతన్ నాయుడు లాగా తమన్నా కూడా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తుంది. నాగార్జున మాటలు ఈ వాదనకి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇప్పుడు కాకపోయినా ఒక రెండు వారాల తర్వాత హౌస్ లోకి తమన్నా రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఒకవేళ నిజంగా వైల్డ్ కార్డ్ ఉన్నట్టయితే తమన్నా కాకుండా ఎవరైనా కొత్త కంటెస్టెంట్ వస్తే బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.


ఎందుకంటే పోయిన సీజన్ లో రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. బయట విషయాల వల్ల ప్రభావితమై తనదైన ఆట ఆడలేకపోయాడు. ఈ విషయాల్ని గమనించిన ప్రేక్షకులు కొత్త వాళ్ళని కోరుకుంటున్నారు. అసలు నిజంగా వైల్డ్ కార్డ్ ఉంటుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: