కెమెరా ముందుకొచ్చి 13ఏళ్లయింది. ఓ నటిగా ఆమెను అందరూ మర్చిపోయారు. కానీ ఓ దర్శకుడు తను రాసుకున్న పాత్రకు ఆమె అయితేనే సూట్ అవుతుందనుకున్నాడు. ఎట్టకేలకు ఒప్పించారు. దశాబ్దం విరామం తర్వాత మేకప్ వేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు విజయశాంతి. స్టార్ హీరోలందరితో నటించిన నిన్నటి తరం హీరోయిన్ విజయశాంతి. కర్తవ్యం.. పోలీస్ లాకప్ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఈ సీనియర్ సినిమాలకు దూరమైంది.

విజయశాంతి రాజకీయాల్లో కూడా అలానే రాణించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె పోరాట స్ఫూర్తి అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ మారడం అందులో అంత కీలకంగా వ్యవహరించలేదనే చెప్పాలి. ఇటీవల ఆమెకు మళ్లీ సినిమాలు చేయాలనే ఆసక్తి కలిగింది. ఆ క్రెడిట్ అంతా అనిల్ రావిపూడిదే. నటిద్దామన్న ఉద్దేశం లేక పోయినా.. అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతో.. 13ఏళ్ల తర్వాత మరోసారి కెమెరా ముందుకొచ్చింది విజయశాంతి. 

మహేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇటీవలే మొదలైన షెడ్యూల్ లో ఈ సినియర్ హీరోయిన్ జాయిన్ అయింది. ఈ సందర్భంగా సినిమాలోని ఆమె లుక్ ను పోస్ట్ చేశాడు.13ఏళ్ల విరామంలో ఆమెలో ఎలాంటి మార్పులేదు. అదే క్రమశిక్షణ, అదే ప్రవర్తన.. అదే ధీరత్వం అంటూ ట్వీట్ చేశాడు దర్శకుడు. మహేశ్ బాబు, విజయశాంతి కాంబినేషన్ కొత్తేమీ కాదు. కొడుకు దిద్దిన కాపురంలో విజయశాంతి కొడుకుగా మహేశ్ నటించాడు. మరి సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి పార్త ఏంటో తెలియదు కానీ.. హీరో తర్వాత కీరోల్ ఆమెదేనట. 







మరింత సమాచారం తెలుసుకోండి: