బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తమిళ యువ తరంగం విజయ్ సేతుపతి తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. విజయ్ ఈ వార్తను మెల్ బోర్న్ లో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ పెస్టివల్ లో ఆఫీషల్ గా మీడియాకి కన్ఫర్మ్ చేశారు. విజయ్ మాట్లాడుతు ఇంకా కేవలం టాక్స్ మాత్రమే జరుగుతున్నాయని, మిగితా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని అన్నారు.
విజయ్ సేతుపతి కొనసాగిస్తూ కింగ్ ఖాన్ శారుఖ్ ఖాన్  మరియు  మెగాస్టార్ అమితాబచ్చన్ లకు తను చాలా పెద్ద ఫ్యాన్ అని చేబుతూ. అమితాబచ్చన్ గారి చాలా సినిమాలు చూసానని, రీసెంట్ గా వచ్చిన పింక్ లో ఆయన నటన తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఈ ఫంక్షన్ ఛీఫ్ గెస్ట్ గా వచ్చిన శారుఖ్ ఖాన్ గారిని కలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
విజయ్ సేతుపతి మరియు అమీర్ ఖాన్ కలిసి నటిస్తున్నరని వార్తలు నెల రోజులుగా వినబడుతున్నాయి.నెల రోజున క్రీతం అమీర్ ఖాన్ విజయ్ నటిస్తున్న "సంగా థామిజహన్" షూటింగ్ సెట్ ని విజిట్ చేశారు. ఈ సేట్ నుండి వచ్చిన ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అమీర్ కొన్నిసినిమా ఆలోచనలు విజయ్ కి చెప్పాడని,అ ఆలొననలు విజయ్ కూడా నచ్చడంతో వాటిపై చాలా సేపు మాట్లాడుకున్నారు.విజయ్, అమీర్ ఇద్దరు పాత్ర కోసం ఎదైన చెస్తారు.ఈ కామన్ పాయింటే ఈ కాంబోకి కారణం అని అందరు అనుకుంటున్నారు 
అమీర్ ఖాన్ సౌత్ హీరోతో నటించడం ఇది రెండో సారి.మొదటి సారి సిద్దార్థతో "రంగ్ దె బసంతి" లో నటించాడు.విజయ్ ప్రస్తుతం మెల్ బోర్న్  ఫీల్మ్ ఫెస్టెవల్ కి గెస్ట్ గా హాజరయ్యారు. సూపర్ డీలక్స్ చిత్రానికి గాను ఆయనకు బెస్ట్ అక్టర్ అవార్డ్ వచ్చింది. ఈ సినిమాకు "ఈక్వాలిటి ఇన్ సినిమా" అనే పురస్కారం  కూడా లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: