'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా పై దేశవ్యాప్తంగా భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులు సృష్టిస్తోంది. దాదాపు 300 కోట్లు బడ్జెట్ తో దక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే మొత్తాన్ని రాబట్టినట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. అయితే అధికారికంగా ఈ లెక్కలు ప్రకటించకపోయినా గాని ట్రేడ్ వర్గాల ప్రకారం సాహో సినిమా ఆల్రెడీ మూడు వందల ముప్పై కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


ఈ క్రమంలో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 125 కోట్లు పలికినట్లు సమాచారం. సౌత్ ఇండస్ట్రీ లో మిగతా రాష్ట్రాలు మొత్తం కలుపుకుంటే 46 కోట్లు పలకగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సాహో సినిమా 120 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో అయితే 42 కోట్ల బిజినెస్ చేసినట్లు అంచనాలు వేస్తున్నారు. ఇక శాటిలైట్. డిజిటల్ ఆడియో రైట్స్ రూపంలో చాలా కోట్లు భారీ మొత్తంలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటంతో అలాగే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా నే హైప్ బీభత్సంగా ఉంది.


దీంతో సినిమాకి ఇంత బిజినెస్ జరిగిందని...ఇక సినిమా కనుక హిట్ అయితే దేశవ్యాప్తంగా ఉన్న 'బాహుబలి' రికార్డులు పగిలిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదని సినిమా లెక్కలు తెలుసుకున్న ట్రేడ్ వర్గాల వారు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటనలో నటించడం జరిగింది. ఎక్కువగా చూసుకుంటే ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీని బాగా టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటించగా సుజిత్ డైరెక్షన్ చేశారు. యు.వి.క్రియేషన్స్ సంస్ద వారు నిర్మించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: