టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం ఒక జాతీయ స్థాయి సూపర్ స్టార్స్ లో ఒకరుగా కొనసాగుతున్నారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు, ఒకదానిని మించి మరొకటి మనదేశంతోపాటు విదేశాల్లో కూడా అద్భుతమైన విజయాలు దక్కించుకుని, ప్రభాస్ కు సూపర్ స్టార్ ఇమేజిని తెచిపెట్టాయి. ఇక ఆ సినిమాల తరువాత దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సాహో సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాక, దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా ఆ అంచనాలు మరింతగా పెంచడంతో, ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది. 

ఈనెల 18వ తేదీన ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనుంది సాహో యూనిట్. అలానే మరోవైపు అటు బాలీవుడ్ లోను, ఇటు తెలుగులోనూ ప్రభాస్ మరియు శ్రద్ధ అప్పుడే సాహో ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలెట్టేసారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా బిజినెస్ రూ.300 కోట్ల వరకు జరిగిందని సమాచారం అందుతోంది. అయితే సినిమాపై ఇంత విపరీతమైన హైప్ ఉన్నప్పటికీ, సినిమా యూనిట్ మాత్రం లోలోపల కొంత భయంతో వణికిపోతోందట. ఎందుకంటే ఏ మాత్రం సినిమా టాక్ కాస్త అటు ఇటు అయినా, సినిమా భారీ నష్టాలూ చవిచూడవలసి వస్తుందని భయపడుతున్నారట. ఇక ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత ప్రేక్షకనాడి పట్టడం కష్టతరంగా మారింది. 

అత్యంత భారీ ఖర్చులతో స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు సైతం డిజాస్టర్లుగా మిగులుతూ, అస్సలు ఏ మాత్రం హైప్ లేని కొన్ని చిన్న సినిమాలు అద్భుతమైన సక్సెస్ ని సాధించడమే అందుకు ఉదాహరణ. నిజానికి సాహో టీమ్ మొత్తానికి తమ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్ ఉందట, అయితే ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ ఎవ్వరికైనా కొంత భయం ఉండడం అనేది సహజం, అని అయితే ట్రైలర్ రిలీజ్ తరువాత సాహో తప్పకుండా అందరిని అలరించి, అలానే అద్భుతమైన కలెక్షన్ సాదిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ పలువురు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈనెల 30న రిలీజ్ కానున్న సాహో ఎంతటి విజయాన్ని మరియు ఎంతమేర కలెక్షన్ ని అందుకుంటుందో చూద్దాం...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: