బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన అత్యంత భారీ బడ్జెట్ సినిమా సాహో. కేవలం బడ్జెట్ పరంగానే కాదు, రన్ టైమ్ లో కూడా ఇది పెద్ద సినిమానే. క్రెడిట్ టైటిల్స్, నో స్మోకింగ్ యాడ్స్ తో కలుపుకుంటే సాహో సినిమా దాదాపుగా 3 గంటల నిడివి ఉందని తెలుస్తోంది. ఇదే రన్ టైమ్ తో సెన్సార్ కు పంపించాలా లేక ఇంకా ట్రిమ్ చేద్దామా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట. మేకింగ్ లోనే కాదు, రన్ టైమ్ విషయంలో కూడా తెలుగు మూవీ మేకర్స్ ఇప్పుడు చాలా ఫ్రీడమ్ తీసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి, రంగస్థలం, మహానటి లాంటి సినిమాల సక్సెస్ తో రన్ టైమ్ గురించి దర్శక నిర్మాతలు ఏమాత్రం ఆలోచించడం లేదు. రెండున్నర గంటలకే సినిమాకు శుభం కార్డ్ వేయాలని రూల్ ఏమీ పెట్టుకోవడం లేదు. 

ఇప్పుడు సాహో బృందం కూడా అదే ఫాలో అవుతున్నారు. ఈ సినిమా ఫైనల్ వెర్షన్ 2 గంటల 52 నిమిషాలు ఉందట. సినిమా చూసిన చాలామంది ఇదే రన్ టైమ్ తో రిలీజ్ చేయాలని సూచించారని తాజా సమాచారం. మేకర్స్ మాత్రం ఇంకొంతమంది సూచనలు, సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ 2 గంటల 52 నిమిషాల్లో దాదాపు గంటన్నర నిడివి పూర్తిగా యాక్షన్ సన్నివేశాలున్నాయంటే.. సాహోను ఏ రేంజ్ లో తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, సినిమాను కేవలం 3 పాటలకే పరిమితం చేయడానికి కారణం కూడా ఈ రన్ టైమ్ అని తెలుస్తోంది.

అయితే ఎక్కువ మంది మాత్రం సినిమాను మరో 7-8 నిమిషాలు ట్రిమ్మ్ చేస్తే బాగుంటుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఇక ఈ రెండు రోజుల్లోగా రన్ టైమ్ పై ఓ నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు సినిమా ప్రమోషన్ లో భాగంగా మిగిలిన మూడో పాటను కూడా త్వరలోనే విడుదల చేసి, దేశవ్యాప్తంగా ప్రమోషనల్ టూర్స్ ప్రారంభించాలని చిత్ర బృందం పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ నెల 30 న ప్రపంచ వ్యాప్తంగా సాహో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: