సినిమా హిస్టరీలో 22 ఏళ్ళ లంచగొండి తనంపై ఓ స్వాతంత్ర యోధుడు జరిపిన పోరాటాన్ని ఎంతో చక్కగా వెండి తెరపై చూపించారు స్టార్ డైరెక్టర్ శంకర్.  లంచం తీసుకున్న ఎవ్వరైనా శిక్షార్హులే అంటూ తన సొంత కొడుకునే దారుణంగా చంపే సేనాపతి పాత్రలో విశ్వనటుడు కమల్ హాసన్ నటనకు యావత్ భారత దేశం సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  ద్విపాత్రాభినయంలో నటించిన కమల్ తండ్రీ కొడుకులుగా నటించారు.  ఈ మూవీలో వృద్దుడి పాత్రలో జీవించాడు. 

డైరెక్ట‌ర్ శంక‌ర్‌- విశ్వనటుడు క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భార‌తీయుడు చిత్రం ఎన్ని రికార్డులు తిర‌గ‌రాసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.  దాదాపు 22 ఏళ్ళ త‌ర్వాత ఈ మూవీకి సీక్వెల్ చేస్తున్నారు. రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమాని ఆగ‌స్ట్ నెలాఖ‌రు నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు స‌మాచారం.  తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఏక కాలంలో తీయ‌నున్న‌ట్టు టాక్.  ఈ మూవీలో మొదటిసారిగా కమల్ హాసన్ సరసన కాజల్ నటిస్తుంది.

మరో ముఖ్యపాత్రలో రకూల్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి..కానీ కన్ఫామ్ కాలేదు. దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం . శింబు కూడా ముఖ్య పాత్ర చేయ‌నున్నాడ‌ని అంటున్నారు.  ఈ రోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘భారతీయుడు 2 ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  ‘భారతీయుడు’లో తాను పోషించిన సీబీఐ ఆఫీసర్‌ పాత్రనే సీక్వెల్‌లోనూ నెడుముడి వేణు పోషించనున్నారు. వెన్నెల కిషోర్ కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ మూవీకి సంగీతం  ‘భారతీయుడు’లో తాను పోషించిన సీబీఐ ఆఫీసర్‌ పాత్రనే సీక్వెల్‌లోనూ నెడుముడి వేణు పోషించనున్నారు. వెన్నెల కిషోర్ కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: