ఏ హీరో అయినా ఫ్లాప్ వస్తే నర్వస్ అవుతాడు. కొందరు స్టార్స్ కు ఫ్లాప్స్ నుండి తేరుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ బాలీవుడ్ బాద్ షా మాత్రం ఫ్లాప్స్ ను ఎంజాయ్ చేస్తున్నాడట. కొంతకాంగా సక్సెస్ లేని ఆ స్టార్ అపజయాలనే ఆస్వాదిస్తున్నాడట. ప్రస్తుతం ఆయన చేసిన  కామెంట్స్ బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. అంత పెద్ద హీరో ఇలా సమాధానం చెప్పడంపై సినీ అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 

బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ కు హిట్స్ కరువయ్యాయి. ఆరేళ్ల కిందట వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత షారుఖ్ కి మళ్లీ ఆరేంజ్ లో హిట్ పడలేదు. ఈ ఆరేళ్లలో కమర్షియల్ సినిమాలు చేసిన ఎక్స్ పర్ మెంట్స్ ఏది చేసినా కింగ్ ఖాన్ కు మాత్రం సక్సెస్ దక్కలేదు. ఇదే విషయాన్ని అడిగితే షారుఖ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇఛ్చి సర్ ప్రైజ్ చేస్తున్నాడు. 

తన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంపై షారుఖ్ ఖాన్ డిఫరెంట్ గా రియాక్టయ్యాడు. ఈ మధ్య కాలంలో వరుస ఫెయిల్యూర్స్ ని ఒప్పుకున్న ఈ స్టార్ హీరో ఫెయిల్యూర్ లను కూడా ఆస్వాదిస్తున్నా అని చెప్పి షాక్ ఇచ్చాడు. సక్సెస్ లను ఆస్వాదించినట్టే ఇపుడు ఫెయిల్యూర్ లను ఆస్వాదిస్తున్నానంటూ చెప్పి ఆశ్చర్యపరిచాడు. 

షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న జీరో చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ సినిమా తర్వాత ఈ బాలీవుడ్ స్టార్ మరో సినిమా చేయలేదు. అయితే ఫ్లాప్స్ తో తన పని అయిపోలేదని..మళ్లీ హిట్ సినిమాలు చేసే సత్తా తనలో ఉందంటున్నాడు. త్వరలోనే ఆడియన్స్ ని సర్ ప్రైజింగ్ తో పలుకరిస్తా అంటూ.. బాద్ షా చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.   





మరింత సమాచారం తెలుసుకోండి: