అక్కినేని కోడలిగా మారిన తర్వాత సమంత మరింత ఫాంలోకి వచ్చింది. మజిలీతో సూపర్ హిట్ అందుకున్న సమంత ఈమధ్యనే వచ్చిన ఓ బేబీ సినిమాతో కూడా సెన్సేషనల్ హిట్ అందుకుంది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాల్లో నటిస్తున్న సమంత ఇప్పుడు కొత్తగా వెబ్ సీరీస్ ల మీద కూడా కన్నేసింది.


ఇప్పటికే చెన్నైలో ఆ వెబ్ సీరీస్ షూటింగ్ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ తెలుగు, తమిళ, హింది భాషల్లో తీస్తున్నారట. నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో ఈ వెబ్ సీరీస్ తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ వెబ్ సీరీస్ లో నటించేందుకు గాను సమంత దాదాపు ఓ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందని తెలుస్తుంది.  


ఓ పక్క సినిమాలు ఇప్పుడు వెబ్ సీరీస్ ఇలా సమంత పెళ్లి తర్వాత కూడా తన కెరియర్ సూపర్ జోష్ గా కొనసాగుతుంది. సమంత ప్లానింగ్ చూసి మిగతా స్టార్ హీరోయిన్స్ అంతా మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు. మరి సమంత వెబ్ సీరీస్ ఎలా ఉండబోతుంది అందులో ఎవరెవరు నటిస్తున్నారు అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.


తమిళంలో నయనతార ఫాం కాస్త తగ్గినట్టు అనిపించగా సమంత ఆ గ్యాప్ కవర్ చేసేలా మంచి సక్సెస్ రేటు కొనసాగిస్తుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుతున్న సమంత కెరియర్ లో మరెన్నో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైందని తెలుస్తుంది. అక్కినేని కోడలిగా ప్రస్తుతం ఆ ఫ్యామిలీ హీరోల కన్నా సమంత మాత్రమే మంచి ఫాంలో ఉందని చెప్పొచ్చు. వెబ్ సీరీస్ తో సమంత మరో సరికొత్త సంచలనం సృష్టించనుందని డిసైడ్ అయిపోవచ్చు. సమంత వెబ్ సీరీస్ ఎలా ఉంటుందో అని ఆమె ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: