యంగ్ హీరో శర్వానంద్ 'పడి పడి లేచే మనసు' అనుకున్నట్టుగా సక్సస్ ని ఇవ్వలేకపోయింది. సాయిపల్లవి తో స్క్రీన్ షేర్ చేసుకొని హను రాఘవపూడి దర్శకత్వం లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాడు. కానీ ఆ సినిమా శర్వాకి నిరాశనే మిగిల్చింది. దాంతో సుధీర్ వర్మ చెప్పిన కథకు ఓకే చెప్పి వెంటనే సెట్స్ మీదకు వెళ్ళాడు. డిలే డిలేగా కంప్లీట్ చేసుకున్న 'రణరంగం' ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలుగజేసింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన టీజర్, థియోట్రికల్ ట్రైలర్ ఇక శర్వాకి గ్యారెంటీ హిట్ అన్నంతగా భారీ క్రేజ్ ని తీసుకువచ్చాయి. సాంగ్ ప్రోమోస్ కూడా ఈ సినిమాని బాగా హైలెట్ అయ్యేలా హైప్ క్రియోట్ చేయడంతో పోటీగా ఏ సినిమా ఉన్నా కూడా శర్వా హిట్ కొట్టడం ఖాయం అని అందరు భావించారు. 

కానీ ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రావడం చిత్ర యూనిట్ కి ఒకరకంగా షాకిచ్చింది. ఇన్ని అంచానలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్, ఫ్లాప్ అనే టాక్ ను తెచ్చుకోవడం నిజంగా శర్వాకి పెద్ద షాకే. ఈ సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ చెప్పిన సీక్రెట్స్ కొన్ని సినిమాకి మైనస్ అయినట్టు తెలుస్తోంది. ముందుగా ఈ కథ రవితేజ కి చెప్పడం తను నో చెప్పాక శర్వాతో ఫిక్స్ అవడం...ఈ సినిమాకు గాడ్ ఫాదర్-2 ఇన్స్పిరేషన్ అని చెప్పడం.. వంటి అన్నో అంశాలు సినిమాకి పెద్ద మైనస్ అయ్యాయినిపిస్తోంది. మరి డైరెక్టర్ ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి సీక్రెట్స్ బయటకు చెప్పాడో కానీ సినిమాని చేజేతులా నాశనం చేశాడని ఫిల్మ్ నగర్ లో అనుకుంటున్నారు. ఎటొచ్చి ఈ సినిమా ఒప్పుకొని శర్వానంద్ అడ్డంగా బుక్కాయాడు.. అని చాలామంది చెప్పుకుంటున్నారు. 

కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియ దర్శన్ హీరోయిన్స్ గా నటించినప్పటికి వీళ్ళకి నటించడానికి అంతగా స్కోప్ లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. ముఖ్యంగా కాజల్ అంటే కనీసం సినిమాకు ఎంతో కొంత కలిసి వస్తుందనుకున్నారు శర్వా ఫ్యాన్స్. అయితే డైరెక్టర్.. కాజల్ పాత్రకి  కూడా ఈ సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత ఉండదని చెప్పడంతో అప్పుడే ఫిక్స్ అయ్యారు. ఇక దీనికి తోడు అడవి శేష్ హీరోగా.. రెజీనా ముఖ్య పాత్రలో వచ్చిన 'ఎవరు'.. 'రణరంగం' తో పోటీ పడి తొక్కి పెట్టేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బదులు ప్రీమియర్ షో వేసి మీడియా తో పాటు.. వచ్చిన ప్రేక్షకులకు 'ఎవరు' సినిమా చూపించడంతో ఒక్కసారిగా సినిమాపై పాజిటివ్ బజ్ క్రియోటయ్యింది. రిలీజ్ కి ముందురోజే ఎవరు హిట్ అనే టాక్ తెచ్చుకోవడం బాగా కలిసొచ్చింది. ఇక మొదటి షో నుండే 'ఎవరు' సూపర్ హిట్ అనే టాక్ రావడంతో రణరంగ కి గట్టి దెబ్బ పడింది. పాపం శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే అన్నీ ఆవిరైపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: