పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా ఇలా వరుస విజయాలతో స్టార్ హీరో రేంజ్ కి అతి తక్కువ కాలంలో ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ.  తన మేనరీజం, యాస తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయి..అంతే కాదు తన సినిమాల్లో ఎప్పటికప్పుడు వేరియేషన్స్ కూడా చూపిస్తున్నాడు ఈ యంగ్ హీరో.  ఈ మద్య రిలీజ్ అయిన డీయర్ కామ్రెడ్ మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది.  విజయ్ దేవరకొండ తెలుగు ప్రేక్షకుల మనసే కాదు, తమిళ ప్రేక్షకుల మనసు కూడా దోచాడు.

డీయర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా తాను ఎప్పటి వరకు సినీ పరిశ్రమలో ఉంటానో తెలియదని..అప్పటి వరకు ప్రేక్షకులను తనవంతుగా ఎంట్రటైన్ చేయడానికి ప్రయత్నిస్తానని అన్నారు.  విజయ్ దేవరకొండ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు.  ప్రస్తుతం క్రాంతి మాధ‌వ్, ఆనంద్ అన్నామలై ద‌ర్శ‌క‌త్వంలో రెండు సినిమాలు చేస్తు బిజీ బిజీగా ఉన్నాడు.  తాజాగా దుబాయ్ లో జరిగిన 'సైమా' అవార్డుల కార్యక్రమానికి వచ్చిన విజయ్ దేవరకొండ వేలుకి గాయం అయ్యింది. 

దాంతో విజయ్ దేవరకొండకు ఏమైందో అని ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. సాధారణంగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్లు చాలా నేచురల్ గా ఉంటాయని తెలిసిందే.  ఆయన డూప్ లేకుండానే ఎక్కువగా యాక్షన్ సీన్లలో పాల్గొంటారని టాక్. ఆ మద్య డీయర్ కామ్రెడ్ సినిమా షూటింగ్ సమయంలో కాకినాడ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో ఏదైనా ప్రమాదం జరిగి వేలికి గాయం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. కాకపోతే..సైమా అవార్డు ఫంక్షన్ కి స్టయిల్ గా బ్లాక్ ప్యాంట్, బ్లాక్ డిజైనర్ టీ షర్ట్, వైట్ కోట్ ధరించి ట్రెండీగా వచ్చిన విజయ్, మిడిల్ ఫింగర్ కు కట్టు కట్టుకుని కనిపించాడు. ఇంతకీ అతని వేలికి ఏమైందన్న విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: