మహేష్ తాజాగా తెరపైకి వస్తున్న ‘వన్-నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్ రోల్ లీకయింది. ఈ సినిమా కోసం సదరు హీరోయిన్ క్రితి సనాన్ ఓ కొత్త అవతారం ఎత్తింది. డైలాగులు కొట్టడం, స్టెప్పులు వేయడం మాత్రమే తెలిసిన ఈ హీరోయిన్ ఈ సినిమా కోసం న్యూస్ రీడర్ గా అవతారమెత్తింది. కారణం ‘వన్’ సినిమాలో క్రితి పాత్ర ఇదే నట. దీనికోసం ఆమె వార్తలు చదువుతున్న సీన్స్ ను తాజాగా షూట్ చేసారు. సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల మద్య ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. దీనిపై టాలీవుడ్ లో భారి అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు సంబందించిన ప్రతి విషయం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. రాం ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ఈ సీన్స్ ను ఫిల్మ్ సిటీ లోని ఐ-ఫ్లోర్ లో చిత్రీకరిస్తున్నారు. తర్వాత యూరప్, బ్యాంకాక్ లో కొంత షూటింగ్ పూర్తి చేసుకుని తదుపరి హైదరాబాద్ లో మళ్లీ షూటింగ్ జరుపుకుంటుందట ‘వన్’. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: