దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సినీ పండుగ అయిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2019 ఖతార్ లో నిర్వహించారు. మొదటి రోజు తెలుగు మరియు కన్నడ చిత్రాలకు అవార్డులు ప్రదానం చేయగా రెండవ రోజు తమిళ ఇండస్ట్రీకి అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా ఉత్తమ చిత్రానికి గాను 'పరియేరుం పెరుమాళ్' ఎంపికయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు అయిన ధనుష్ కి వడ చెన్నై చిత్రానికిగాను ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ కు 96 చిత్రానికి గానూ ఉత్తమ నటి అవార్డు దక్కింది.

తమిళంలో అవార్డులు సాధించింది వీరే :

ఉత్తమ చిత్రం – పరియేరుం పెరుమాళ్
ఉత్తమ దర్శకుడు – పండిరాజ్ (కడైకుట్టి సింగం)
ఉత్తమ నటుడు – ధనుష్ (వడ చెన్నై)
ఉత్తమ నటి – త్రిష (96)
ఉత్తమ నటి (క్రిటిక్స్) – ఐశ్వర్యా రాజేష్ (కూడే)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – జయం రవి (కూడే)
ఉత్తమ సంగీత దర్శకుడు – అనిరుధ్ (కొలమావు కోకిల)
స్పెషల్ జ్యూరీ ఉత్తమ నటుడు – కాథిర్ (పరియెరుం పెరుమాళ్)
ఉత్తమ విలన్ – వరలక్ష్మి శరత్ కుమార్ (సర్కార్)
ఉత్తమ హాస్య నటుడు – యోగి బాబు (కోలమావు కోకిల)
ఉత్తమ బాల నటుడు – ఆరవ్ రవి
ఉత్తమ గాయని – ధీ (రౌడీ బేబీ – మారి 2)
ఉత్తమ గాయకుడు – ఆంటోనీ దాసన్ (సొడకు మెల – గ్యాంగ్)
ఉత్తమ గేయ రచయిత – విఘ్నేష్ శివన్ (నానా తానా – గ్యాంగ్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – ఆర్ డి రాజశేఖర్ (అంజలి సి.బి. ఐ)
ఉత్తమ ఆరంగేట్ర దర్శకుడు – నెల్సన్ (కొలమావు కోకిల)
ఉత్తమ సహాయ నటి – ఈశ్వరి రావు (కాలా)
ఉత్తమ సహాయ నటుడు – ప్రకాష్ రాజ్ (60 వయడు మానిరం)
జీవిత సాఫల్య పురస్కారం – సురేష్ కుమార్ మరియు మేనక సురేష్ కుమార్


మరింత సమాచారం తెలుసుకోండి: