కొన్నేళ్ల క్రితం ప్రఖ్యాత దర్శకుడు శంకర్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ ల కలయికలో రూపొందిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. దేశంలో లంచగొండితనాన్ని అంతమొందించడానికి ఒక వృద్ధుడు, ఆఖరుకి లంచగొండి అయిన తన సొంత బిడ్డను కూడా అంతమొందించడానికి సిద్ధపడతాడు. ఆ విధంగా అద్భుతంగా రూపొందిన ఈ సినిమాకు అప్పట్లో ఖర్చు కూడా భారీగానే పెట్టడం జరిగింది. అలానే ఈ సినిమాలో కమల్ ను వృద్ధుడిగా చూపించడం కోసం ప్రత్యేకంగా మేకప్ చేయించారు శంకర్. 

ఇక మళ్ళి ఇన్నేళ్ల తరువాత ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు2 ని తెరకెక్కిస్తున్నారు శంకర్. కమల్ ప్రధానపాత్రలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ముందుగా తొలిసారి శంకర్ సినిమాకు యువ సంగీత తరంగం అనిరుద్ సంగీతాన్ని అందిస్తుండగా, పాటలు కూడా అందరిని అలరించేలా శంకర్ దగ్గరుండి మరీ కంపోజ్ చేయిస్తున్నారట. ఈ సినిమాలో కమల్, మరియు కాజల్ పలు రకాల యుద్ధ నైపుణ్య విద్యలను ప్రదర్శిస్తారట. దానికోసం వారిద్దరూ కొద్దిరోజలుగా విదేశీ శిక్షకుల దగ్గర శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అలానే కమల్ మేకప్ విషయంలో హాలీవుడ్ నుండి ప్రొఫెషనల్ మేకప్ మ్యాన్స్ ను పిలిపించి మరీ మేకప్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారట. అలానే ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ టెక్నాలజీని వినియోగించనున్నారట. 

ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా ఒక ప్రముఖ నటుడు నటిస్తున్నాడని అంటున్నారు. అలానే  సినిమాలో ఇతర నటుల క్యాస్టింగ్ విషయమై కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని ఎంపిక చేస్తున్నారట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా బడ్జెట్ విషయమై ఎక్కడా కూడా రాజీ పడేది లేదని, ఎందుకంటే సినిమాలో క్వాలిటీ దెబ్బతినకూడదని, కాబట్టి సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు కూడా సుముఖంగా ఉన్నారని సమాచారం. మరి ఇన్ని రకాల ప్రత్యేకతలతో పక్కాగా హిట్ కొట్టాలని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా, రేపు విడుదల తరువాత ఎంతవరకు ప్రేక్షకుల అంచనాలు అందుకుని సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: