త్రివిక్రమ్‌ కు గత కొంతకాలంగా కొన్ని సెంటిమెంట్స్ ని బాగా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ని రిపీట్ చేయడం..తన సినిమాకు పెట్టే టైటిల్ విషయంలో మొదట అక్షరం అ వచ్చేలా చూసుకోవడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది మన మాటల మాంత్రీకుడికి. అలానే మరీసారి  'అ' సెంటిమెంట్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. 'అజ్ఞాతవాసి' ఫ్లాప్‌ అయినా, 'అరవింద సమేత'  యావరేజ్‌ అనిపించుకున్నా తాజా సినిమాకి ముందు 'అల' జోడించాడు త్రివిక్రమ్‌. టైటిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కానీ  ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ మాత్రం బన్ని ఫ్యాన్స్ నే కాదు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. నితిన్ తో తీసిన 'అ ఆ' తర్వాత త్రివిక్రమ్‌ సినిమాలో హీరో పక్కింటి అబ్బాయిలా కనిపించాడు. 

అల్లుఅర్జున్‌ గెటప్‌, మురళి శర్మ లుక్‌, హౌస్‌ సెటప్‌ అంతా మధ్యతరగతి కుటుంబాలకి తగ్గట్టుగా వుంది. త్రివిక్రమ్‌ సినిమాలు ఇలా కనిపించి చాలా కాలమవుతోంది. హీరోని అయితే విపరీతమైన దాత్తుడిగానో లేదా అపర కుబేరుడిలానో చూపించడం బాగా అలవాటయింది. అయితే ఇన్నాళ్ళకు త్రివిక్రమ్‌ మళ్లీ రూట్స్‌కి వచ్చి ఒక సగటు కుటుంబ కథని రాశాడనే ఫీలింగ్‌ని 'అల వైకుంఠపురములో' టీజర్‌ తెచ్చింది.

అల్లు అర్జున్‌కి అనుకోకుండా వచ్చిన గ్యాప్‌ని ఉపయోగించి చమత్కారంగా సినిమాలో డైలాగ్‌గా చెప్పించడం కూడా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ టీజర్‌ తర్వాత 'అల వైకుంఠపురములో'పై అంచనాలు పెరిగాయి. మహేష్‌ నటిస్తున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 'సరిలేరు నీకెవ్వరు'కి ఎదురు వెళ్తోన్న ఈ సినిమా ఎలాంటి హైప్ అయితే క్రియేట్‌ చేయాలో అంతకు మించి క్రియేట్‌ చేయగలిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకముందు అల్లు అర్జున్ తీసిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతోనైనా బన్ని కి బ్లాక్ బస్టర్ ఇస్తారేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: