టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోప‌క్క జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాయిస్ ఓవ‌ర్‌. ఇలా వీరిద్ద‌రిలో ఒక‌రు క‌నిపిస్తుండ‌గా, మ‌రొక‌రు స్వ‌రం వినిపిస్తుంటే ఆ కిక్కే వేర‌ప్పా అంటూ అభిమానుల సంద‌డి. తాజాగా ఈ స‌న్నివేశానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో సైతం వైర‌ల్‌గా మారాయి.

చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా విడుద‌ల చేసిన చిరు, ప‌వ‌న్ క‌లిసి ఉన్న ఫోటోలు మెగా అభిమానుల్లో జోష్‌ను నింపుతుంటే.. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో మాత్రం స‌రికొత్త చ‌ర్చ‌కు తెర తీస్తోంది. అన్న‌ద‌మ్ముళ్లుగా ఉన్న వీరి అనుబంధం సినిమాల‌కు మాత్ర‌మే పరిమిత‌మా..?  పొలిటిక‌ల్‌గా కూడా క‌లుస్తుందా..?  అన్న చ‌ర్చ ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు జ‌న‌సైనికుల్లోను వినిపిస్తుంది.ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన నాటి నుంచి చిరు, ప‌వ‌న్ ఇద్దరూ ఏ రాజ‌కీయ స‌మావేశంలోనూ క‌లిసి క‌నిపించ‌లేదు. మ‌రోపక్క నాగ‌బాబు మాత్రం గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేశారు.


జ‌న‌సేన త‌రుపున పోటీచేసి ఓడిపోయారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం జ‌న‌సేన‌కే కాకుండా ఏ పార్టీకి ప్ర‌చారం చేయలేదు. మ‌ద్ద‌తూ తెలుప‌లేదు.మ‌రోప‌క్క‌, ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఘోర ఓట‌మిని చ‌విచూడ‌టంతో ఆ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న ప‌వ‌న్ ఇక రాజ‌కీయాల‌వైపు చూడ‌రని, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డం క‌న్ఫామ్ అంటూ కామెంట్లు వినిపించాయి. కానీ, ఆ వ్యాఖ్య‌ల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖండించారు. అంతేకాకుండా మ‌రో ప‌దేళ్ల‌పాటు ఫుల్‌టైమ్ పాలిటిక్స్ అంటూ తేల్చిచెప్పారు. అందులో భాగంగానే ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం కింది స్థాయి నుంచి పార్టీని మ‌రింత ప‌టిష్ట‌ప‌రిచేందుకు దృష్టిసారించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఈ నేప‌థ్యంలో సినిమాకోసం క‌లిసిన‌ అన్న‌ద‌మ్ముళ్లు.. రాజ‌కీయాల్లోనూ క‌లిసి ప‌నిచేస్తారా..? జ‌న‌సేన కోసం చిరంజీవి ఒక అడుగైనా ముందుకేస్తారా..?  జ‌న‌సేన శ్రేణుల్లో విస్తృత‌స్థాయి చ‌ర్చ జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: