అద్నాన్ సమీ పాకిస్థాన్ కి చెందిన వాడయినా భారతీయులకు సుపరిచితుడు. హిందిలో చాలా హిట్ అల్బమ్స్ చేశాడు.తెలుగు లో ఊసరవెల్లి, ౧౦౦%లవ్ సినిమాల్లో పాటలు పాడారు.  . అద్నాన్ సమీ చాలా కాలం నుండి ఇండియలో ఉంటున్నాడు.అద్నాన్ సమీ కి 2016 లొ భారతీయ పౌరసత్వం వచ్చింది.


 అద్నాన్ సమీ స్వాతంత్ర్య దినోత్సవం రోజు తన పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ఆ రోజు నుండి ఆయనపై పాకిస్థాన్ నుంచి సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది. అద్నాన్ సమీ  సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటాడు. ట్రోలర్స్ కి తనదైన శైలిలో ఘటైన సమాధానం ఇస్తూ  వస్తున్నాడు.ఓ ట్రోలర్ అద్నాన్ సమీనీ 'మీ నాన్న ఎక్కడ పుట్టారు? ఎక్కడ మరణించారు? అంటూ ప్రశ్నించగా. దానికి రిప్లై ఈ విధంగా ఇచ్చాడు... 'మా నాన్న 1942లో ఇండియాలో పుట్టారు, 2009లో ఇండియాలో మరణించారు.


మరోక ట్రోలర్ నీకు  ఏమైనా ధైర్యం ఉంటే కాశ్మీర్ సమస్యపై స్పందించు, అప్పుడు  ఇండియా నిన్ను ఏం చేస్తుందో నీకు తెలుస్తుంది అని ప్రశ్నించగా, దానికి సంమాధానంగా కశ్మీర్ అనేది ఇండియాలో అంతర్భాగం. నీది కానీ  విషయంలో అనవసరంగా వేలు పెట్టవద్దు' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
మరోక పాకిస్థాన్ నెటిజన్ నువ్వు ఇలాంటి వాడివి కాబట్టే నిన్ను మేము వదిలించుకున్నాం అని అన్నాడు.   అద్నన్ సమీ " మీరు వదిలించుకోలేదు నా ఇష్టంతో బయటకు వచ్చాను" అని సమధానం ఇచ్చాడు

.సుష్మా స్వరాజ్ మరణం పై కూడా ఎమోషనల్‌గా స్పందించాడు. ఫిబ్రవరిలో జరిగిన వైమానికా దాడుల తర్వత పాకిస్థాన్ ట్రోలర్స్ కి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ప్రియమైన పాకిస్థాన్ ట్రోలర్స్ ఇది మీ ఇగో గురించి కాదు. ఇది ఉగ్రవాదులను నాశనం చేయడం గురించి.ఉగ్రవాదులు మాకే కాదు మీకు కూడా శత్రువులే.  మీ చిన్న బుద్ది నవ్వు వచ్చేలా ఉందని అన్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: