సాధారణంగా మీడియా అంటే ఎప్పుడు తప్పుడు వార్తలు రాయరని అందరికి గట్టి నమ్మకం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీడియా కరెక్ట్‌గా రాసినా కూడా కొన్ని సోషల్ వెబ్ సైట్స్ ఆ రాతలను వక్రీకరించి రివర్స్ లో రాయడం కూడా రెగ్యులర్ గా జరుగుతుంటుంది. ఇప్పుడు ఇలాంటి ఒక ఆసక్తికరమైన విషయమే బాలీవుడ్ మీడియాలో జరిగింది. 'మీ గురించి ఏదైనా రూమర్ స్ప్రెడ్ చేయాలంటే ఏం రాయాలి?' అని అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన విధంగా సమాధానం ఇచ్చింది బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్. 'సల్మాన్ ఖాన్ తో నాకు పెళ్లి అని రూమర్ సృష్టించి స్ప్రెడ్ చేయండి..' అని సరదాగా మాట్లాడింది ఈ హాట్ బ్యూటి. అందుకు తగ్గట్టుగానే జరీన్ విషయంలో బాలీవుడ్ మీడియా కుప్పలు కుప్పలుగా కథనాలు సృష్టించింది.

'సల్మాన్ ను జరీన్ పెళ్లి చేసుకోబోతోందా?', 'సల్మాన్ – జరీన్ ఖాన్ ల పెళ్లి వెనుక అసలు కథ..' అంటూ కథనాలు ఇస్తోంది బాలీవుడ్ మీడియా. జనాలు దాదాపుగా మరిచిపోతున్న దశలో జరీన్ ఖాన్ ఇలా వార్తల్లోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. మీడియా అడగగానే ఆసక్తిదాయకమైన రూమర్ ను అందించింది జరీన్ ఖాన్. ఆ సంగతలా ఉంటే..దాదాపు దశాబ్దం కిందటే జరీన్ ఖాన్ విషయంలో ఇలాంటి రూమర్లు వచ్చాయి. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి జరీన్ ఖాన్ ను హీరోయిన్ గా 'వీర్' అనే భారీ అంచనాల సినిమాతో పరిచయం చేశాడు సల్మాన్. అచ్చం కత్రినాకైఫ్ ఫీచర్స్ తో అప్పట్లో జరీన్ బాగా పాపులర్ అయింది.

అయితే 'వీర్' సినిమా బోర్ అనిపించింది. డిజాస్టర్ గా నిలిచింది. దీంతో జరీన్ కెరీర్ అంత ఊపందుకోలేదు. ఆ తర్వాత హాట్ హాట్ గా నటిస్తూ జరీన్ అడపాదడపా సినిమాల్లో మెరుస్తోంది. సల్మాన్ కూడా జరీన్ ను ఆ తర్వాత అంతగా ఆదుకున్నట్టుగా కనిపించలేదు. మరి ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి సల్మాన్ ని నిజంగా అట్రాక్ట్ చేయాలని ఇలా వార్త స్ప్రెడ్ చేయమనిందా..లేదా మళ్ళీ తను లైం లైట్ లోకి రావడానికి సల్మాన్ పేరు వాడిందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇదంతా బాగానే ఉంది కానీ పాపం సల్మానే అనవసరంగా బుక్కాయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: