టాలీవుడ్ యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతం గోవిందం వంటి సినిమాలతో వరుస సక్సెస్ లు సాధిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన హీరోగా వచ్చిన టాక్సీ వాలా సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ, ఆ తరువాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు వరుస పరాజయాలు మూటగట్టుకున్నాయి. అయితే తన సినిమాలు ఫెయిల్ అవడం పై విజయ్ ఇటీవల తన సన్నిహితులతో మాట్లాడుతూ, నిజానికి డియర్ కామ్రేడ్ సినిమాను తన యూనిట్ మొత్తం ఎంతో కష్టపడి తెరకెక్కించడం జరిగిందని, అలానే సమాజంలో ఆడవారి పట్ల జరుగుతున్న అమానుషాలకు కొంతైనా తమ వంతుగా అడ్డుకట్ట వేసేలా, సినిమాలో ఆడవారి పై జరుగుతున్న లైంగిక వేధింపుల అంశాన్ని చూపించడం జరిగిందని, 

అంతేకాక ప్రేక్షకులను ఆకట్టుకునే కొన్ని ఇతర అంశాలు కూడా తమ సినిమాలో పొందుపరచడం జరిగిందని, అయినప్పటికీ ప్రత్యేకంగా కొందరు పనిగట్టుకుని మరీ, తమ సినిమాపై లేనిపోని విధంగా తప్పుడు ప్రచారాలు చేసి నెగటివ్ టాక్ తెచ్చారంటూ వాపోయాడట. అయితే ఇది కేవలం డియర్ కామ్రేడ్ విషయంలో మాత్రమే జరుగలేదని, గతంలో తన ఇతర సినిమాల విషయంలో కూడా అటువంటి వారు, ఇలానే చేసారని కూడా అన్నట్లు సమాచారం. అయితే తనపై, అలానే తన సినిమాలపై ఎన్ని కుట్రలు చేసినప్పటికీ, తాను మాత్రం భవిష్యత్తులో మరిన్ని సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేస్తూనే ఉంటానని కూడా అన్నారట. అయితే విజయ్ వెలిబుచ్చిన ఈ అభిప్రాయాన్ని, ఆయన సన్నిహితుల్లోని కొందరు బయటకు లీక్ చేయడంతో అవి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. 

కొందరు విజయ్ మాటలను సమర్దిస్తుంటే, మరికొందరు మాత్రం, ఒకవేళ నిజంగానే డియర్ కామ్రేడ్ సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఉండి ఉంటె, తప్పకుండా ప్రేక్షకులు ఆదరించేవారని, మరి అదే విజయ్ నటించిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు ప్రేక్షకులు మెచ్చే సూపర్ హిట్ చేసారు కదా అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై సినిమా విశ్లేషకులు మాట్లాడుతూ, నిజానికి తన సినిమా విషయమై ఒక హీరో ఇలా మాట్లాడినట్లు, ఈ విధమైన వార్తలు గతంలో కూడా పలువురు హీరోల విషయంలో బయటకు రావడం జరిగిందని, అయితే అసలు ఆ హీరో ఆ మాటలు అన్నారా లేదా అనే విషయం నిర్ధారణ కాకుండా, ఆయనను నిందించడం సరైనది కాదు అంటున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: