Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 9:13 am IST

Menu &Sections

Search

స‌ల్మాన్ ఖాన్ ప‌రువు తీసిన దీపికా..!

స‌ల్మాన్ ఖాన్ ప‌రువు తీసిన దీపికా..!
స‌ల్మాన్ ఖాన్ ప‌రువు తీసిన దీపికా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు దిమ్మ తిరిగేలా బాలీవుడ్ సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి దీపికా పదుకొనే షాక్ ఇచ్చింది. అయితే స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టించ‌మ‌ని త‌న‌ను సంప్ర‌దించిన ద‌ర్శ‌క నిర్మాత‌లతో ఆయ‌న‌తోనా..?  న‌టించ‌ను.., న‌టించ‌లేను.., సల్మాన్ ఖాన్ స‌ర‌స‌న న‌టించాల‌న్న ఆస‌క్తి అస్స‌లు లేదంటూ స‌మాధానం చెప్పి పంపించేసింద‌ట‌.స‌ల్మాన్ ఖాన్‌ను ఉద్దేశిస్తూ దీపికా ప‌దుకొనే చేసిన ఈ వ్యాఖ్య‌ల‌నే ఇప్పుడు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.


అయితే బాలీవుడ్‌లో త‌న‌ను మించిన హీరో లేడు అన్న‌ది స‌ల్మాన్ ఖాన్ న‌మ్మ‌కం. అంతేకాదు తాను హీరోయిన్‌ల‌కు లైఫ్ ఇస్తానే త‌ప్ప‌.. హీరోయిన్‌ల‌ను చూసి త‌న సినిమాల‌కు ప్రేక్ష‌కులు రారంటూ స‌ల్మాన్ ఖాన్ ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో బ‌హిరంగంగానే చెప్పుకొచ్చారు. ఆ మాట‌లు కొన్ని సంద‌ర్భాల్లో నిజ‌మైనా.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో జీరో అయ్యాయి. ఆ క్ర‌మంలోనే క‌త్రినా కైఫ్ వంటి హీరోయిన్‌తోనే ఎక్కువ చిత్రాల్లో క‌లిసి న‌టించాడు.


ఇక దీపికా ప‌దుకొనే విష‌యానికొస్తే, ప్ర‌స్తుతం బాలీవుడ్ నెం.1స్థానం ఆమెదే. ప‌ద్మావ‌తి వంటి సినిమాలు ఆమె వ‌ల్లే ఆడాయ‌ని, ఆ సినిమా ఒక్క‌టి చాలు ఆమె క్రేజ్ ఎలాంటిదో అన్న‌ది సినీ విశ్లేష‌కుల మాట‌. అయితే దీపికా త‌న వివాహం జ‌రిగిన నాటి నుంచి సెలెక్టివ్ స్టోరీల‌నే ఎంచుకుంటూ సినిమాల‌కు క‌మిట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో స‌ల్మాన్‌తో న‌టించ‌డానికి మీకేంటి స‌మ‌స్య‌..? అని ప్ర‌శ్నించిన మీడియా ప్ర‌తినిధుల‌కు దీపికా త‌న‌దైన శైలిలో స‌మాధాన‌మిచ్చింది.


స‌ల్మాన్‌ఖాన్ సెట్‌లో మోనార్క్‌లా ఉంటాడ‌ని, ఆయ‌న చెప్పిన‌ప్పుడు షూటింగ్ మొద‌లు కావాలి. ఆయ‌న నిద్ర లేచిన‌ప్పుడే షూటింగ్ ప‌నులు కూడా మొద‌ల‌వ్వాలి. ఆయ‌న మూడ్‌నుబ‌ట్టి షూట్ జ‌రుగుతుంది.  సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు సైతం స‌ల్మాన్ ఖాన్ మూడ్ స్వింగ్స్‌నుబ‌ట్టి మూవ్ అవుతుంటారు. కానీ నాకు అలా కుద‌ర‌దు అంటూ ఖ‌రాకండిగా చెప్పిన దీపికా స‌ల్మాన్ ఖాన్ ప‌రువు తీసింది.


salman-khan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING