'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా పై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లో చూసిన సన్నివేశాలు హాలీవుడ్ సినిమాని తలపిస్తున్నాయి అని అంటున్నారు చాలా మంది సినిమా ప్రేక్షకులు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ ...రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఏ స్థాయి కొట్టిందో...అదే స్థాయిలో సాహో సినిమా హిట్టు అవ్వాలని పూర్తిగా యాక్షన్ స్టోరీ అయిన సాహో సినిమాని ఎన్నుకున్నట్లు సమాచారం. దాదాపు ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అదిరిపోయే రీతిలో విడుదల చేయటానికి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మరియు పోస్టర్స్ అభిమానులను సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నారు సాహో సినిమా టీం.


ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఒకటి రీసెంట్ గా విడుదల అయ్యింది. దీంతో ఆ పోస్టర్ ని చూసిన చాలామంది సాహో సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా ప్రభాస్ శ్రద్ధా కపూర్ మధ్య రొమాన్స్ పిక్స్ అని కామెంట్ చేస్తున్నారు. పోస్టర్ ని చూస్తుంటే హీరోయిన్ శ్రద్దా కపూర్ తో కథానాయకుడు ప్రభాస్ ఇంటెన్స్ లవ్ ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.


అదే విధంగా శ్రద్దా చేతిలో గన్ పట్టుకొని కళ్ళల్లో ఎదో తెలియని భావాన్ని చూపిస్తోంది. సినిమా చూస్తే ఆమె కళ్ళ వెనక ఉన్న అసలు భావం ఏమిటో తెలుస్తుంది. సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించేలా ఉన్న ఈ స్టిల్ ప్రమోషన్ లో బాగా క్లిక్కవుతోంది. మరి సాహో సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఆగస్టు 30న విడుదల కాబోతున్న ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

 



మరింత సమాచారం తెలుసుకోండి: