సాధారణంగా వెండి తెరపై కనిపిస్తే చాలు పెద్ద సెలబ్రెటీలం అయిపోతామని చాలా మంది భావిస్తుంటారు.  అలాంటింది స్టార్ హీరో రేంజ్ ఉన్నా అతి సామాన్య వ్యక్తుల్లా ప్రవర్తించే హీరోలు చాలా మంది ఉన్నారు.  తమిళ నాట అజిత్, విజయ్, సూర్య ఈ హీరోలు జనాల మద్యలో తిరుగుతూ చాలా సింపుల్ గా వ్యవహరిస్తుంటారు. తమకు స్టార్ హోదా ఉందన్న విషయం పక్కన బెట్టి తమ ఫ్యాన్స్ తో చాలా సంతోషంగా గడుపుతుంటారు.  ఇక తెలుగు లో నాని ఈ హీరో ఎంతో సింపుల్ గా ఉంటాడు.  ఈ విషయం చాలా సార్లు బయట పడింది.

తాజాగా మరోసారి నాని సింపుల్ సిటీ మరోసారి వెలుగు లోకి వచ్చింది. సాధారణంగా నాని ఎక్కడికైనా వెళ్లాంటే ఎలాంటి హంగులూ, ఆర్భాలకు పోరు..కామన్ మ్యాన్ లా చాలా సింపుల్ గా కనిపిస్తాడు. తాజాగా నానికి సంబంధించి ఎయిర్ పోర్ట్ లో ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే నాని ఏదో ప్రయాణం కోసం ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో వెళుతున్నప్పుడు ఎవరికైనా తనిఖీలు సహజమే. సెక్యూరిటీ సిబ్బంది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతినిస్తారు.

ఎయిర్ పోర్ట్ లో నాని వెళుతుండగా అక్కడి పోలీసులు చెకింగ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా నాని చాలా కూల్ గా వారికి సహకరిస్తూ తాను ఒక హీరో అన్న విషయం పక్కనబెట్టి అందరిలా సింపుల్ గా ప్రవర్తించారు.  తాజాగా ఈ దృష్యాన్ని ఎవరో ఔత్సాహికులు తన కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ ఫోటోలో సొషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నిజంగా నేచురల్ స్టార్ నాని నేచురల్ బిహేవియర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'V' మూవీలో కూడా నాని నటిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: