నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.  కాగా ఇటీవలే ఈ సినిమా టైటిల్ గురించి  'రాయల్  సింహా' అనే ఆసక్తికరమైన టైటిల్  సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.  కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం  ఈ సినిమాకి 'రాయల్  సింహా'  అని టైటిల్ పెట్టాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి బాలయ్య మళ్లీ  సింహా సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడు.  అయితే ఈ  టైటిల్ కి సంబంధించి ఇంకా ఇటివంటి అధికారిక ప్రకటన అయితే  రాలేదు.  ఇక ఈ చిత్రంలో  రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న  బాలకృష్ణ సరసన  సోనాల్ చౌహాన్ అండ్ వేదిక ఇద్దరు హీరోయిన్లు  నటించనున్నారు.  కాగా తాజాగా   ఈ సినిమా  బ్యాంకాక్ షెడ్యూల్ లో  సోనాల్ చౌహాన్ కూడా ఈ రోజు  పాల్గొందట.  బాలయ్య - సోనాల్ పై ప్రస్తుతం  ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు.  రొమాంటిక్ సాంగ్ గా సాగే  ఈ సాంగ్ కోసం సోనాల్  బికినీ వేస్తోందని తెలుస్తోంది.  


ఇక ఈ చిత్రంలో బాలయ్య  రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే సోనాల్ చౌహన్  మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. అలాగే ఓ కీలకమైన పాత్రలో  నమితను కనిపించనుంది.  నమితది  నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర..  ముఖ్యంగా సినిమాలో  బాలయ్యకి విలన్ గా  కనిపించనుంది.  ఇప్పటికే  సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది.  ఇక  ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ఒక్కడే పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నట్లు తెలుస్తోంది.  బ్లాక్‌బ‌స్ట‌ర్ `లెజెండ్‌` త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది.  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.  `జైసింహా` వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొంద‌నున్న చిత్ర‌మిది.  అలాగే ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. మరి ఈ రెండు టైటిల్స్ లో  ఏ టైటిల్ ను ఫైనల్ చేస్తారో చూడాలి.  ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: