Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 4:51 am IST

Menu &Sections

Search

విషయం లేనప్పుడు టార్గెట్ చెయ్యడమెందుకో ?

విషయం లేనప్పుడు  టార్గెట్ చెయ్యడమెందుకో ?
విషయం లేనప్పుడు టార్గెట్ చెయ్యడమెందుకో ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి  పవన్ ను మరియు ఆయన పార్టీను తొక్కడానికి కొన్ని రాజకీయ శక్తులు అలాగే  వైసీపీ అండ్ టీడీపీ నాయకులూ ఎంతలా ప్రయత్నించారో  అందరికి తెలుసిన విషయమే.  అప్పటీవరకూ  పొగిడిన వారంతా కూడా  పవన్ ఎత్తి చూపించారు. ఇలాంటి వారు అందరికి వత్తాసుగా పలికే  పేరుగాంచిన కొన్ని మీడియా చానెళ్లు గంటల గంటల డిబేట్లు పెట్టాయి పవన్ చేతగాని తనం మీద.  సరే ఇదంతా ఎన్నికల ముందు వరకు దెబ్బ తీసేందుకు చేసారు,  సక్సెస్ అయ్యారు.  కానీ ఎన్నికలు ముగిసి జనసేన ఘోరమైన ఓటమి పాలైన తర్వాత కూడా   జనసేన పై కొన్ని పేరున్న మీడియా సంస్థలు ఇంకా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి.  అసలు పవన్ అనని మాటను కూడా స్వయంగా అతనే అన్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి ఆ మీడియా సంస్థలు. పవన్ ఇప్పటికే ఎన్నో వందల సార్లు తన ప్రాణం పోయినా సరే ఏ పార్టీలోనూ జనసేన పార్టీను విలీనం చెయ్యను అని డబ్బులు లేకపోయినా  తన పక్క వాళ్ళు  తనని వదిలేసినా  టెంట్ వేసుకొని అయినా సరే పార్టీను నడుపుతాను,  అంతేకానీ  ఇంకో పార్టీలో విలీనం చెయ్యనని పవన్ ప్రతి సమావేశంలో చెబుతూనే ఉన్నాడు. 


 అయినా  మన మీడియా సంస్థలు మాత్రం పవన్ జనసేన పార్టీను విలీనం చేసేస్తారని,  పవన్  పై కేంద్రం  ఒత్తిడి తీసుకువస్తుందని.. ఇక జనసేన విలీనం ఖాయమన్న రేంజ్ లో తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అసలు పవన్ కు అంత సీన్ లేదని చెప్పేది వీళ్ళే.. అలాగే   పవన్ కు రాజకీయాలు అంటే ఏమిటో తెలీదు అని చెప్పేది వీళ్ళే.  మరి విషయం లేనప్పుడు  పవన్ ను మరియు ఆయన  పార్టీను ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారో..  వారికే తెలియాలి. ఒక్కటి మాత్రం చాల స్పష్టంగా తెలుస్తోంది. పవన్ ఇలాగే రాజకీయాల్లో కొనసాగితే.. భవిష్యత్తులో పవన్ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది.      


pavan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'భారతీయుడు 2'తో  'గ్యాంగ్ లీడర్' బ్యూటీ !
అరె  అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందా ?
కోడెల మృతిని బాబులిద్దరూ బాగానే వాడుకుంటున్నారు !
న్యూ లుక్ కోసం  'బన్నీ' కసరత్తులు !
శనివారం నాటికి  'సైరా'  సై..సై..  !
కీరవాణికి పని తగ్గించిన రాజమౌళి !
‘సైరా' ట్రైలర్ లో  ఏంటి ఆ  'సర్ ప్రైజ్' ?
రేపటితో యాక్షన్ సీన్స్  పూర్తవుతాయట !
టీడీపీ 'ఎన్టీఆర్' చేతిలోకే  పోతుందా  !
ఎస్వీయూ ఘోరంలో  రాజకీయ కోణం !
'జాన్' పై  ఫోకస్  పెట్టిన  ప్రభాస్ !
'భీష్మ' కోసం నితిన్ చెప్పేశాడు  !
'బందోబస్త్' గురించి సూర్య ఇంట్రస్టింగ్ కామెంట్స్ !
'రాజమౌళి'కి  సైరా ప్రత్యేక షో  ఎప్పుడంటే  !
'తెనాలి రామకృష్ణ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !
'గ్యాంగ్ లీడర్'  యూఎస్  కలెక్షన్స్ !
అరె ఈ సినిమా కూడా ప్లాపేనా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.