తెలుగు చలన చిత్రాలు ఎప్పుడు కొత్తదనాన్ని చూపిస్తాయి. ఆ చూపించడం కూడా ఎంతవరకు అంటే ప్రేమ సీన్లు ఉంటే బ్రేకప్ చెప్పడమో, లేక లవ్ ఉంటే కోరికలు తీర్చుకోవడమో, ఫ్యామిలీ మధ్య సంభాషణలు చూపించడమో, అది లేదంటే దెయ్యం పట్టింది అంటూ హర్రర్ ప్రయోగానికి తెర లేపడమో, ఇది కూడా వర్క్ అవుట్ కాకుంటే రోబో లాంటి సైన్స్ పెంపొందించే సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఇకపోతే ఈ మధ్య కొత్తగా మీతిమీరిన అందాలతో, డబల్ మీనింగ్ డైలాగులతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు.


ఇక ఆ సినిమాలు కూడా రిలీజ్ అయ్యి , పెద్దగా ఏమి లేదండి అనే పబ్లిక్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు అదే తంతు జరుగుతూనే వస్తుంది. డైరెక్టర్లు ఎంత కష్టపడి కోట్లు గుమ్మరించిన కూడా సినిమాకు  కనీస కలెక్షన్లను కూడా రాబట్టలేక నష్టం తప్ప మరేమి మిగలదు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ వాకిట్లో జరుగుతున్న వాస్తవం. ఇక్కడ ఆఫర్లు రాలేవని కొందరు బ్యూటీస్ బాలీవుడ్ కో లేక కోలీవుడ్ కో చెక్కేస్తుంటారు. 


విషయానికొస్తే.. టాలీవుడ్ కు హాలీవుడ్ కు వ్యత్యాసాలను గమనిస్తే, టాలీవుడ్ సినీ జనాలు తీసిన సినిమానే తిప్పి తిప్పి, పిప్పి అయ్యేవరకు తీస్తూనే ఉంటారు. కానీ, హాలీవుడ్ మాత్రం ఎప్పుడు ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటుంది. ఆ సినిమాలు కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న కూడా వాటికొచ్చే బడ్జెట్ కూడా అలానే ఉంటుంది. అక్కడ సినిమాలు కూడా ఒక థీమ్ తో తెరకెక్కుతాయి. అలా చుస్తే హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు డీలా పడిన కూడా మరి కొన్ని సినిమాలు రికార్డులను బ్రేక్ చేసినవే. 


హాలీవుడ్ సినిమాలు తెలుగులో రీమేక్ చేయబడి హిట్ అయినా సినిమాలు ఏంటో  ఇప్పుడు చూద్దాము.. 
బ్లాక్ పాంథర్ - 1.346బిలియన్ డాలర్లు 
 ఎవెంజర్స్ : ఏజ్ ఆఫ్ ఉల్ట్రాన్ - 1.405 బిలియన్ డాలర్లు
ఫ్యూరియస్ 7: 1.516 బిలియన్ డాలర్లు
 మార్వెల్స్ ది ఎవెంజర్స్ : 1.518 బిలియన్ డాలర్లు
 జురాసిక్ వరల్డ్ : 1.671 బిలియన్ డాలర్లు
 ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ - 2.048 బిలియన్ డాలర్లు
 స్టార్ వార్స్ : ది ఫోర్స్ అవేకెన్స్ - 2.068 బిలియన్ డాలర్లు
టైటానిక్ : 2.187 బిలియన్ డాలర్లు
 అవతార్ : 2.789 బిలియన్ డాలర్లు
 ఎవెంజర్స్ : ఎండ్ గేమ్ - 2.790 బిలియన్ డాలర్లు


ఈ సినిమాలు హాలీవుడ్ లోనే కాకుండా, టాలీవుడ్ లో కూడా డబ్ అయ్యి మంచి వసూళ్లనే రాబట్టాయి.. ఇలా చేయాలనుకున్న మన వాళ్ళు చేయలేరు.. ఎవరైనా కూడా ఇలా సినిమాలను తెరకెక్కిస్తే మాత్రం.. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచంలో మారుమోగిపోవడం ఖాయం..


మరింత సమాచారం తెలుసుకోండి: