ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల జోరు బాగా పెరిగిపోతుంది.  అయితే కంటెంట్ బాగుండి మ్యూజికల్ హిట్ అయితే హిట్ అవుతున్నాయి.  ఈ సంవత్సరం పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా బాగానే పోటీ పడ్డాయి..కానీ కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి.  గత వారం రిలీజ్ అయిన మన్మథుడు2, రణరంగం, ఎవరు, కొబ్బరిమట్ట సినిమాల్లో ఎవరు, కొబ్బరిమట్ట హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లు కూడా బాగానే రాబట్టాయి.  అంతకు ముందు డీయర్ కామ్రెడ్, గుణ 369, రాక్షసుడు మూవీస్ రిలీజ్ అయ్యాయి.  అయితే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు మంచి హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది.

ఈ వారంతో చిన్ని సినిమాల ప్రస్థానం ముగిస్తుంది..ఇక రాబోయే రోజులు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి.  ఆగ‌స్ట్ 30న సాహో, ఆ త‌ర్వాత గ్యాంగ్ లీడ‌ర్, వాల్మీకి, సైరా వంటి చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ శుక్ర‌వారం (ఆగ‌స్ట్ 23) దాదాపు ప‌ది సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మ‌య్యాయి.  అయితే ఈ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మూవీ..బాగా ప్రయోషన్లు చేస్తున్నమూవీ కౌసల్యా కృష్ణమూర్తి. 



తమిళ్ లో హిట్ అయిన ఈ మూవీని తెలుగు లో రిమేక్ చేస్తున్నారు. ఇక ఏదైనా జరగొచ్చు అనే మూవీ థ్రిల్లర్, సస్పెన్స్ నేపథ్యంలో వస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు.  ఈ మూవీ ప్రమోషన్ కూడా బాగానే చేస్తున్నారు.  ఈ రెండు సినిమాల‌పై కాస్త అంచనాలు ఉన్నాయి.  టితో పాటు బాయ్‌, ఉండిపోరాదే, నివాసి, హవా , నేనే కేడీ నెం 1, జిందా గ్యాంగ్‌, నీతోనే హాయ్‌ హాయ్‌, కనులు కనులు దోచేనే వంటి చిత్రాలు కూడా శుక్ర‌వారమే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. మరి ఈ మూవీస్ లో ఏ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటుందో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: