పవన్ కళ్యాన్ ఈ పేరు గురించి కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు.  మెగా ఫ్యాన్స్ కి ఈ పేరు వింటేనే పూనకం వచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన పవన్ కళ్యాన్ మొదట్లో కెరీర్ విషయంలో ఇబ్బంది పడ్డా, పట్టుదలతో తాను అనుకున్నది సాధించాడు.  వరుస విజయాలతో తనదైన మానరీజంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. మెగాస్టార్ చిరంజీవి అంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. మొదటి నుంచి పవన్ కళ్యాన్ కి సినిమాలపై కన్నా సమాజసేవ విషయంలోనే ఎక్కువ దృష్టి పెడుతూ వచ్చాడు.

యాక్టర్ గా ప్రజలకు కొంత వరకు సహాయం చేయగలం..అదే రాజకీయ నాయకుడిగా అందరికీ న్యాయం చేయగలం అన్న ఆశయంతో ‘జనసేన’ పార్టీ పెట్టారు. ఈ మద్య జరిగిన ఎన్నికల్లో ‘జనసేన’పార్టీ నుంచి పోటీ చేశారు. కానీ ఆయన పార్టీ తరుపు నుంచి నిలబడిన ఒక్క వ్యక్తి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు.  అయితే పవన్ కళ్యాన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.  అయితే ఓడినంత మాత్రాన తనను ప్రజలు తీరస్కరించలేదని..వారి కోసం పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు పవన్ కళ్యాన్.

తాజాగా ప్ర‌కాశం జిల్లా త్రిపురాంతకం మండ‌లం, అన్న‌స‌ముద్రం గ్రామానికి చెందిన బుడిగ‌య్య పవన్ కళ్యాణ్ వీరాభిమాని కాగా గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు.  అయితే మో థెర‌పీ తీసుకుంటూ పార్టీ కార్య‌క‌లాపాల్లో పాల్గొన్నాడు.  గత కొన్ని రోజుల నుంచి వ్యాతీ తీవ్రరూపం దాల్చడంతో మంచానికే పరిమితం అయ్యాడు బుడిగయ్య.  తనకు పవన్ కళ్యాన్ ని చూడాలని ఉందని చెప్పడం..విషయం తెలుసుకున్న పవన్ వెంటనే అతన్ని కలవాలని చెప్పడంతో అంబులెన్స్‌లో హైదరాబాద్ జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి తీసుకువ‌చ్చారు. క్యాన్సర్ అభిమానిని పరామర్శించిన పవన్ అభిమాని ఆకాంక్షను నెరవేర్చారు. 

ఈ నేపథ్యంలో బుడిగయ్య ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు తనకు అన్ని విధాలుగా ధైర్యం చెప్పిన పవన్ లక్షరూపాయలు విరాళంగా ఇచ్చాడు. అంతే కాదు అభిమాని ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన ఎర్రగొండపాలెం పార్టీ ఇంచార్జ్ ను బుడిగయ్య ఆరోగ్యంను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: