యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ప్ర‌భాస్ మిర్చి, బాహుబ‌లి వంటి చిత్రాల‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టి కెరీర్‌లోనే టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా  ఓ స్టాయిలో అభిమానులను సంపాధించుకుని నేష్న‌ల్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు తాజాగా ఆగ‌ష్టు 30న విడుద‌ల కాబోయే చిత్రం `సాహో`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. దాదాపు 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెర‌కెక్క‌బోయే ఈ సినిమా ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.


స్టార్ హీరోగా ఎదిగిన ప్ర‌భాస్ కోట్ల‌లో ఉన్న మార్కెట్ మ‌రియు క్రేజ్.. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోయే `సాహో`కు ప్ల‌స్ అవుతుంది. అయితే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి క‌థ‌నాలు ఆస‌క్తిక‌రంగా వినిపిస్తున్నాయి. నిజానికి ప్ర‌భాస్ కుటుంబానికి పొలిటిక‌ల్ ట‌చ్ ఉంది. కృష్ణంరాజు గ‌తంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగా ప‌ని చేశాడు. అయితే అనుకున్న స్టాయికి ఎద‌గ‌లేక‌పోయినా.. ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీలో కొన‌సాగుతున్నారు. ఇటీవ‌ల కృష్ణంరాజు గారి సతీమణి , ప్ర‌భాస్ పెద్ద‌మ్మ అయిన శ్యామలదేవి ఓ ఇంటర్వ్యూలో ప్ర‌భాస్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తిగా మారింది.


ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ భ‌విష్య‌త్‌లో ఎప్పుడైనా అవ‌స‌రం ఉన్న‌ప్పుడు పాలిటిక్స్‌లోకి రావొచ్చ‌ని, అందులో త‌ప్పేమి లేద‌న్న‌ట్టుగా శ్యామ‌ల‌దేవి వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ఏడేళ్లు బాహుబ‌లి మ‌రియు సాహోకు కేటాయించిన ప్ర‌భాస్ అదే స్థాయిలో ప్ర‌శంస‌లు అందుకున్నాడు. అయితే ఇక నుంచి ఏడాదికి ఒక సినిమా చేయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిజానికి ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌ని ప్ర‌భాస్ పొలిటిక‌ల్ ఎంట్రీ విష‌యంపై ప్ర‌స్తావించ‌డం క‌రెక్ట్ కాదని అంటున్నారు. మ‌రియు ప్ర‌భాస్‌పై ఉన్న మ‌క్కువ‌తోనే శ్యామ‌ల‌దేవి ఇలా అన్నార‌ని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: