Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 8:11 pm IST

Menu &Sections

Search

సాహో ని తలదన్నేలా ' సైరా' చేస్తుంది ఇదే..!

సాహో ని తలదన్నేలా ' సైరా' చేస్తుంది ఇదే..!
సాహో ని తలదన్నేలా ' సైరా' చేస్తుంది ఇదే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీప‌రంగానే కాకుండా, ఆలోచ‌న‌ల ప‌రంగానూ తాను చేసే ప్ర‌తి ప‌నీ చాలా గ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటుంటాడు. ఆ గ్రాండ్ ఆలోచ‌న‌లే త‌న తండ్రి సినిమా విష‌యంలో మ‌రింత గ్రాండ్‌గా మార‌నున్నాయి. హీరోతోపాటు నిర్మాత‌గా ఉన్న రామ్ చ‌ర‌ణ్ త‌న రేంజ్ ఏపాటితో మ‌రోసారి చూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే రామ్‌చ‌ర‌ణ్ ఉన్న‌ప‌లంగా త‌న రేంజ్ ఏంటో  మ‌రోసారి చూపించేందుకు సిద్ధ‌మ‌వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మాత్రం యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాసేన‌ట‌. అదేనండీ ఈ నెల 18న హైద‌రాబాద్‌లో ప్ర‌భాస్ న‌టించిన సాహో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘ‌నంగా రిచ్‌లుక్‌లో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.


ఆ ఈవెంట్‌ను మైమ‌రిపించేలా సైరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించాల‌ని రామ్ చ‌ర‌ణ్ నిర్ణ‌యించాడ‌ట‌.ఇప్ప‌టికే సైరా మూవీకి సంబంధించి ఇప్ప‌టికే షూటింగ్ సంద‌డి పూర్త‌యింది. మేకింగ్ వీడియో కూడా రిలీజై సోష‌ల్ మీడియాలో ధూమ్‌ధామ్ రేపుతోంది. ఇక మిగిలింద‌ల్లా ప్ర‌మోష‌న‌ల్ స్కెచ్ ఒక్క‌టే. దాన్ని కూడా నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ ఒక ప‌ట్టుప‌డుతున్నాడు. అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన ముంబైలో ప్రెస్‌మీట్ పెట్టి బాలీవుడ్ స‌ర్కిల్స్‌కు సైరా ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వివ‌రించ‌నున్నాడు.


ఇక ఈ రోజు విడుద‌లైన సైరా టీజ‌ర్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. టీజ‌ర్ కూడా వ‌చ్చేయ‌డంతో ఇక సినిమాను జ‌నాల్లోకి ఎలా తీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న‌పై రామ్‌చ‌ర‌ణ్ పూర్తి ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తుంది.బ‌య‌టి ప్ర‌పంచానికి గ‌ర్వ‌కార‌ణాలుగా ఎక్స్‌పోజ్ అవుతున్న రెండు తెలుగు సినిమాలు సాహో.. సైరా.., కానీ టాలీవుడ్ లోప‌ల మాత్రం ఈ రెండు సినిమాల‌కు ఇంట‌ర్న‌ల్ వార్ త‌ప్పేలా లేదు. భారీ బ‌డ్జెట్ నుంచి వ‌సూళ్ల వ‌ర‌కు అన్ని విష‌యాల్లోనూ సైరా, సాహో కాంపిటీటివ్ స్పిరిట్‌తో దూసుకెళ్తున్నాయి.


రిలీజ్ డేట్ విష‌యంలో నెల రోజుల గ్యాప్ ఉన్న‌ప్ప‌టికీ ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి ఉండాల‌న్న క‌మిట్‌మెంట్ క‌నిపిస్తుంది. ఆ క్ర‌మంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోను భారీత‌నం క‌నిపించేలా రామ్‌చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నాడు.రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓహో అనేంత రేంజ్‌లో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. డ‌యాస్ స్ట్ర‌క్చ‌ర్ నుంచి అభిమానుల గ్యాథ‌రింగ్ వ‌ర‌కు అన్ని విష‌యాల్లోనూ రిచ్‌నెస్ క్లియ‌ర్‌గా కనిపించింది. బాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా సాహో ఈవెంట్ మేనేజ్‌మెంట్ అన్ని ఏర్పాట్లు చేసింది. స‌రిగ్గా ఇక్క‌డే రామ్ చ‌ర‌న్ అలెర్ట్ అయ్యాడు. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సైరాను త‌ల‌ద‌న్నేలా ఉండాల‌న్న‌ది చెర్రీ ఆర్డ‌ర్. కాస్టింగ్‌లో కానీ, కాస్ట్ ఆఫ్ మేకింగ్ విష‌యంలో కానీ, క‌మ‌ర్షియల్ వ్యాల్యూస్‌లో కానీ సాహోకి ఏ మాత్రం దిగ‌దుడుపు కాదు సైరా. పైగా నేష‌న‌ల్ ఫేమ్ ఉన్న హీరో చిరంజీవి సినిమాగా సైరాకు క్రేజ్ ఉంది. అందుకే సినిమా ప్ర‌మోష‌న్‌లో ఆ మాత్రం హంగామా చూపించాల‌ని కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్స్ భావిస్తోంది. 


saaho
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING