టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఎవరి అండ లేకుండా చాలా ఓర్పుతో సహనంతో కష్టపడి సినిమాలు చేసి అందరి మన్ననలను అందుకుని తెలుగు ప్రజల హృదయాల్లో మెగాస్టార్ గా నిలిచిపోయారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగి టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనాన్ని ఏలిన చిరంజీవి 2009వ సంవత్సరంలో రాజకీయాల్లో అడుగు పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి కొన్ని స్థానాలను గెలుచుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.


అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కేంద్ర మంత్రి పదవిని స్వీకరించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలి పోవడంతో 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దారుణంగా రెండు రాష్ట్రాల్లో ఓడిపోవడంతో క్రియాశీలక రాజకీయాలకు చిరంజీవి దూరమయ్యారు. తిరిగి ఇండస్ట్రీలో అడుగు పెట్టి తానేంటో ఖైదీ నెంబర్ 150 సినిమా తో నిరూపించుకున్నారు. ప్రస్తుతం సైరా సినిమా తో మెగా అభిమానులను పలకరించటానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల ముంబైలో విడుదల చేశారు నిర్మాత రామ్ చరణ్.


ఈ రోజు చిరంజీవి 64వ పుట్టినరోజు సందర్భంగా సైరా టీజర్ ని మెగా అభిమానులతో గిఫ్టుగా ఇచ్చారు. ఇటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగాస్టార్ పుట్టిన రోజులు ఘనంగా జరుగుతున్న క్రమంలో ఈ పుట్టినరోజు వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా భాగం కానున్నారు. అభిమానులంతా కలిసి చేసుకోబోయే ఈ వేడుకకు ముఖ్య అతిధిగా జనసేనాని రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ వేడుకలో హాజరు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. బుధవారం అనగా ఆగస్ట్ 21వ తేదీ శిల్పకళా వేదికగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: