ఎనభైలలో టాప్ హీరోలు .. ఆయన కొత్త పంథా ని చూసి ఉలిక్కిపడ్డారు .. అతని లా మనం చెయ్యగలమా అని ముక్కున వేలేసుకున్నారు. తొంభైలలో హీరోలు .. పోటీ ఇవ్వడానికి కూడా దమ్ము లేక .. నెంబర్ 1 పీఠం లో ఆయన్ని కూర్చోపెట్టి సైలెంట్ గా ఉన్నారు. 2000's లో హీరోలు ఆయనే ఆదర్శం గా ఇండస్ట్రి లో అడుగు పెట్టి ఆయనంత కావాలి అనుకున్నారు. ప్రస్తుత దశాబ్దం లో ఏడు సంవత్సరాలు ఆయన నెంబర్ 1 పీఠానికి దూరంగా, సినిమా ఇండస్ట్రి కి అతీతంగా బతుకుతుంటే ..ఇప్పటికీ టాలీవుడ్ సింహాసనంపై ఎవరు కూర్చోలేక పోతున్నారు.


కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలుతున్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగా అభిమానులు ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చాలా భావోద్వేగానికి గురి అయ్యి స్పీచ్ ఇచ్చారు. సభలో పవన్ మాట్లాడుతూ...నా జీవితంలో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు ఇద్దరే. ఒకరు మెగాస్టార్ చిరంజీవి.. ఇంకొకరు అమితాబ్ బచ్చన్. చిరంజీవి గారు తాను తప్పుదోవ పట్టకుండా మూడు సందర్భాల్లో స్ఫూర్తిగా నిలిచారు.


సైరా చిత్రం గురించి మాట్లాడుతూ.. తమ ఇంటి పేరుతో కొణిదెల అనే గ్రామం ఉందని పవన్ తెలిపారు. అన్నయ్య చిరంజీవి గారు సైరా లాంటి ఉద్యమ వీరుడి కథలో నటించాలని చాలా రోజులుగా కోరుకున్నా. సైరా చిత్రాన్ని నిర్మించాలనే ఉండేది. కానీ నాదగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు. కానీ  రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందని పవన్ అన్నారు. ఉయ్యాలవాడ కథని తెరక్కించాలని తెలుగు సినిమా మద్రాసులో ఉన్న సమయం నుంచి వింటున్నా. కానీ ఎవ్వరికి ధైర్యం చాల్లేదు. ఒక్క రాంచరణ్ మాత్రమే నిర్మించాడు అని పవన్ తెలిపారు. చిరంజీవి గారు మాత్రమే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్ర చేయగలరని ఆయన కోసమే రాసిపెట్టి ఉందని పవన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో తన వాయిస్ ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

 



మరింత సమాచారం తెలుసుకోండి: