2019 అమెరికన్ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే 10 మంది లిస్ట్ రిలీజ్ చేసింది. 2018 జూన్ 1 నుండి 2019 జూన్ 1 వరకు వరల్డ్ వైడ్ గా ఏ హీరో ఎంత సంపాదించాడు అన్న దాన్ని బట్టి ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్ సిద్ధం చేశారు. ఈ లిస్ట్ లో మొదటిస్థానంలో హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ ఉన్నారు. 


ఈ ఇయర్ డ్వేన్ జాన్సన్ 89 మిలియన్ డాలర్లు సంపాదించినట్టు ఫోర్బ్స్ తెలిపింది. ఇక ఈ లిస్ట్ లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నాల్గవ స్థానాన్ని సంపాదించారు. గడిచిన సంవత్సరం అక్షయ్ కుమార్ 65 మిలియన్ డాలర్స్ రెమ్యునరేషన్ రూపంలో అందుకున్నారట. ఇండియన్ స్టార్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నది మాత్రం అక్షయ్ కుమార్ అని చెప్పొచ్చు. 


ఫోర్బ్స్ లిస్ట్ టాప్ టెన్ లో ఎవరెవరు ఉన్నారో చూస్తే..


డ్వేన్‌ జాన్సన్‌ - 89.4 మిలియన్ డాలర్లు టాప్ ప్లేస్ లో ఉండగా.. క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ - 76.4 మిలియన్‌ డాలర్లతో ఫోర్బ్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ కొట్టేశాడు.  రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ - 66 మిలియన్‌ డాలర్లతో 3వ స్థానంలో ఉన్నారు. ఇండియా నుండి అక్షయ్‌ కుమార్‌ - 65 మిలియన్‌ డాలర్లతో నాల్గవ స్థానంలో నిలిచారు. ఇక ఐదవ స్థానంలో జాకీ చాన్‌ - 58 మిలియన్‌ డాలర్లు సంపాదించారు. 6వ పొజిషన్ లో బ్రాడ్లీ కూపర్‌ - 57 మిలియన్‌ డాలర్లు ఉండగా.. 7వ స్థానంలో ఆడమ్‌ సాండ్లర్‌ - 57 మిలియన్‌ డాలర్లు ఫోర్బ్స్ లిస్ట్ లో ఉన్నారు. 8వ ప్లేస్ లో క్రిస్‌ ఇవాన్స్‌ - 43.05 మిలియన్‌ డాలర్లు సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. 9వ స్థానంలో పాల్‌ రూడ్‌ - 41 మిలియన్‌ డాలర్లు పర్ ఇయర్ ఎర్న్ చేస్తున్నారట. ఇక ఫైనల్ గా 10వ స్థానంలో విల్‌ స్మిత్‌ - 35 మిలియన్‌ డాలర్లు అందుకుంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: