పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ నటిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ దేవర కొండ నత్తి ఉన్న పాత్ర చేయబోతున్నాడని తెలుస్తుంది. నిజానికి స్క్రిప్ట్ ,ముందుగానే పూరీ బన్నీకి వినిపించారు. అయితే పూర్తి స్కిప్ట్ బన్నీకి నచ్చకపోవడంతో పక్కన పెట్టేశారు. ఇప్పుడు అదే స్క్రిప్ట్ తో విజయ్ తో సినిమాను చేయబోతున్నారు పూరీ. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫైటర్ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్టు సమాచారం. అయితే ఇది వరకే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. రిజిస్టర్ చేయకపోతే అదే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 


అయితే పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశారు. ఇష్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పూరికి పలువురి హీరోల నుంచి అభినందనలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు మెచ్చుకోవటంతో ఇక పూరి బ్యాక్ అనే స్థితికి వచ్చేశారు. దీనితో పూరి తరువాత సినిమా ఎవరితో ఉంటుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు విజయ్ తో సినిమా ఫిక్స్ అయ్యింది. అయితే పూరి దర్శకత్వం పట్ల ఇప్పటికి విజయ్ అభిమానులకు ఇంకా భయంగా ఉంది.


పూరీ మళ్ళీ బ్యాక్ వచ్చే రేంజ్ లో ఇస్మార్ట్ శంకర్ లేదని చెప్పాలి. సినిమా మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ మీద నడిచింది గాని చెప్పుకోదగ్గ స్టోరీ అయితే కాదు. దీనితో విజయ్ అభిమానులకు టెన్షన్ మొదలైంది. పూరీ అప్పుడప్పుడు ఒక మాదిరి సినిమా తీయడం అలవాటు. తరువాత ఎక్కువ ప్లాప్స్ ఇవ్వటం పూరీ స్టైల్. అయితే పూరి — విజయ్ కాంబినేషన్ లో సినిమాకు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మనే కోన సాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇష్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో మనం చూశాము. ఇంకా తనలో ఆ ఫైర్ ఉందని మణిశర్మ నిరూపించారు. దీనితో మ్యూజిక్ డైరెక్టుగా మణిశర్మ నే ననీ ఫిక్స్ అయిపోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: