టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన మహర్షి సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ పంథాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తుండగా, వరుసగా మూడవసారి సూపర్ స్టార్ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఎప్పటికపుడు తన సినిమాలు మరియు ఫ్యామిలీ కి సంబందించిన విషయాలు, తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంచుకునే సూపర్ స్టార్, 

నేడు అమెజాన్ కార్చిచ్చు పై ఉద్వేగభరితంగా ట్వీట్ చేయడం జరిగింది. విశ్వంలోని ప్రాణుల మనుగడకు అత్యంత ఆవశ్యకమైన ఆక్సిజన్ ను అందించేవి చెట్లు. ఇటీవల కొన్నేళ్లుగా మనిషి తన స్వార్ధం కోసం అడవులను సైతం తెగనరుకుతూ, వాటిని స్థలాలుగా మార్చి తన నివాస యోగ్యాలుగా మార్చుకుంటూ పోతున్నాడు. అంతేకాక ఫ్యాక్టరీలు వదిలేసే వ్యర్ధ విష వాయువుల వలన ఇప్పటికే గాలిలో కాలుష్యం పెరిగిపోవడంతో మనలో చాలా మందికి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విధమైన చర్యలకు కేవలం మనిషి స్వయంకృతాపరాధమే అనేది అర్ధం అవుతోంది. అందుకనే ప్రతిఒక్కరు తమవంతుగా చెట్లు నాటడం అలవాటు చేసుకోండి అంటూ పర్యావరణ వేత్తలు విపరీతంగా ప్రచారాలు చేస్తున్నారు. ఇక మన భూమికి ఊపిరైన ఆక్సిజన్ ని అందించేవిగా చెప్పబడే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రాంతం, గత రెండు వారాలుగా కార్చిచ్చు అంటుకుని తగలబడిపోతుండడంతో, 

ఆ ఫారెస్ట్ లో తలదాచుకున్న ఎన్నో ప్రాణులు సజీవదహనం అవడంతో పాటు, ఎన్నో చెట్లు ఆ అగ్నికి ఆహుతు అవడంతో పర్యావరణ వేత్తలు, ఆ కార్చిచ్చును ఆర్పేందుకు పలు ప్రభుత్వాలని అర్ధిస్తున్నారు. ఇప్పటికే ఆ కార్చిచ్చు పై కొద్దిరోజులుగా గోగ్రీన్, ప్రే ఫర్ అమెజాన్, సేవ్ ఎర్త్, పేరుతో ట్విట్టర్ సహా పలు మీడియా మాధ్యమాల్లో ప్రజలు హ్యాష్ ట్యాగ్స్ తో హోరెత్తిస్తున్నారు. ఇక నేడు మహేష్ బాబు కూడా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ను మనం కాపాడుకోవాలి, అవి మన విశ్వానికి ఊపిరితిత్తుల వంటివి అంటూ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఉద్వేగంగా పోస్టులు చేయడం జరిగింది. అయితే ఆయన పెట్టిన పోస్టులను సూపర్ స్టార్ ఫ్యాన్స్ రీట్వీట్స్ చేస్తూ, ప్రే ఫర్ అమెజాన్ హ్యాష్ హ్యాష్ ట్యాగ్స్ తో వాటిని మరింత మందికి చేరువయ్యేలా లైక్స్, షేర్స్ చేస్తున్నారు. కాగా మహేష్ చేసిన ఆ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి...!!  


మరింత సమాచారం తెలుసుకోండి: