టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల, రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. గత కొద్దికాలంగా సరైన హిట్ లేని పూరికి, ఈ విజయం మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా హిట్ తరువాత పూరి ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, ఇకపై తాను ఎక్కువగా మాస్ సినిమాల చేస్తానని అన్నారు. ఇకపోతే ఇటీవల పూరి తన తదుపరి ప్రాజెక్టు ని, యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నట్లు పూరి ప్రకటించడం జరిగింది. 

నటి ఛార్మితో కలిసి తన పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఆయన తీయనున్న ఈ సినిమా మంచి మాస్, కమర్షియల్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు విజయ్ నటించని ఒక సరికొత్త పాత్రలో ఇందులో నటించబోతున్నాడట. నోటా, డియర్ కామ్రేడ్ సినిమాల పరాజయాలతో ఒకింత ఢీలాపడ్డ విజయ్ దేవరకొండ, ఈ సినిమాతో తప్పకుండా సూపర్ సక్సెస్ ని అందుకుని, తన ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇవ్వాలని చూస్తున్నాడట. ఇక ఈ సినిమాకు ఫైటర్ అని టైటిల్ ని నిర్ణయించినట్లుగా నేటి ఉదయం నుండి ఫిలింనగర్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అంతేకాక పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఈ టైటిల్ ని రెండు రోజుల క్రితం ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించినట్లు చెప్తున్నారు. 

ఇక ఈ సినిమాకు సంబంధించి కథ, కథనాలు, టైటిల్ సహా అన్ని సిద్ధం అయ్యాయని, మరికొద్దిరోజుల్లో అధికారికంగా ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో విజయ్ సరసన ఒక స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని నిర్ణయించిందట సినిమా యూనిట్. ఇక ఈ సినిమా టైటిల్ విషయమై నేడు ప్రచారం అవుతున్న వార్తలపై కొంతవరకు తమకు సమాచారం ఉందని, అయితే ఇందులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే మాత్రం, పూరి సినిమా టీమ్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే అని వారు అంటున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: