దక్షిణాది సినిమా రంగంలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్న కాజల్ అగర్వాల్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసింది. ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చిన కాజల్ అగర్వాల్ స్థానం వేరు. ఆమెకు పోటీయే లేదు ఎంత వయసు పెరుగుతున్నా కానీ ఆమె అందంగా కొంచెం కూడా తగ్గకపోవడం ఆమె క్రేజ్ కి నిదర్శనం. ముఖ్యంగా ఇండస్ట్రీలో చిన్న హీరో పెద్ద హీరో అనే సినిమా తేడా లేకుండా అన్ని వర్గాల హీరోల పక్కన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించడం ఆమె స్పెషాలిటీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


ఇటువంటి నేపథ్యంలో వరుస ఆఫర్లు అందుకుంటున్న కాజల్ అగర్వాల్ గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని అడపాదడపా హిట్ ను అందుకున్న పెద్దగా రాణించలేక పోయింది. దీంతో తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీ వైపు చూసి ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటువంటి తరుణంలో ఏడు సంవత్సరాల తర్వాత సూర్యతో నటించడానికి రెడీ అయ్యింది. ఏడేళ్ల క్రితం కాజల్ సూర్యతో బ్రదర్స్ (2012) అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. ఇక ఇన్నేళ్లకు శివ దర్శకత్వంలో సూర్య చేయనున్న బిగ్ ప్రాజెక్ట్ లో కాజల్ నటించడానికి ఒప్పుకుంది.


ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో ఈ విషయంపై దర్శకుడు అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఇవ్వనున్నాడు. ఇక ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 సినిమాతో మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గా కోలీవుడ్ లో కోమలి సినిమాతో బేబీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మొత్తం మీద కాజల్ అగర్వాల్ సంవత్సరాల తర్వాత సూర్యతో సినిమా చేయడానికి రెడీ అయిన నేపథ్యంలో సూర్య అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: