బిగ్ బాస్ లో ఎలిమినేషన్ టైం వచ్చేసింది. ఈ వార నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. అయితే నామినేషన్ జరిగిన నాటి నుండి నేటి వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారనే వార్త చర్చనీయాంశం అయింది. నామినేషన్ లో ఉన్న ఏడుగురిలో ఎవరు హౌస్ నుండి వెళ్ళిపోనున్నారు. నామినేషన్ లో ఆ ఏడుగురు బాబా భాస్కర్, శివజ్యోతి, మహేష్ విట్ట, ఆషు రెడ్డి, రాహుల్, హిమజ, పునర్నవి.


వీరందరినీ ఓసారి గమనిస్తే నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు వచ్చి మొదటి స్థానంలో ఉన్నది రాహుల్ సిప్లిగంజ్. మొత్తం ఎనిమిది ఓట్లు తెచ్చుకుని రికార్డు సృష్టించాడనే చెప్పవచ్చు. అయితే రాహుల్ కి ఎనిమిది ఓట్లు రావడం చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే దాని వల్లే ప్రేక్షకుల్లో రాహుల్ పట్ల సింపతీ పెరిగి, ఓట్లు కూడా పెరిగాయని తెలుస్తుంది. కాబట్టి ఎలిమినేషన్ నుండి సేఫ్ అవుతాడని అంటున్నారు.


ఇక మిగిలిన ఆరుగురిలో బాబా భాస్కర్ కి చాలా ఫాలోయింగ్ ఉంది. అదీగాక ఆలీ చేసిన పనికి కోపంగా ఉన్న ప్రేక్షకులు బాబా భాస్కర్ ని ఓట్ల వర్షం కురిపించారు. శివజ్యోతి, పునర్నవి లకి అంత నెగెటివిటీ లేకపోవడమ్ వల్ల వారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. మహేష్ విట్ట తెలివిగా తను చేసిన పనులకు వివరణ ఇవ్వడంతో, అతని పట్ల సానుకూలత బాగా పెరిగింది. ఇక మిగిలింది హిమజ, ఆషు రెడ్డి. వీరిద్దరిలో ఎవరు వెళ్తారనే టెన్షన్ ఎక్కువైంది.


మొన్న రిలీజైన ప్రోమో వల్ల హిమజ కి తక్కువ ఓట్లే పడ్డాయని తెలుస్తుంది. అయినా కూడా ఆషు ఆమెని బిట్ చేయలేదని అంటున్నారు. మొదటి నుండి సైలెంట్ గా ఉంటున్న ఆషు ఈ వారం ఎలిమినేషన్ లో డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ఏ విషయంలోనూ తన వాదన వినిపించకపోవడం వల్ల ఆమెకి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ వచ్చిందనే చెప్పాలి. దాంతో ప్రేక్షకులు ఆమెకి కనెక్ట్ కాలేకపోయారని తెలుస్తుంది. ఈ విధంగా ఒక్కోసారి ఊరికే ఉండటంమ్ కూర్చొవడం తప్పే అవుతుందని అర్థం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: