ఏముహుర్తాన మల్లెమాలగారు జబర్దస్త్ షో ను స్టార్ట్ చేసారో కాని ఇప్పుడు ఆ షో,అందులో నటించే ఆర్టిస్టులు ఎంత పేరు సంపాదించారో,పేరుతో పాటు డబ్బు కూడ వచ్చిందనుకోండి.కాని ఒకప్పుడు తిండిలేని స్దాయి నుండి ఇప్పుడు తినగలిగినంత తిండిని సంపాదిస్తున్నారు ఈ షోలో చేస్తున్న నటులు.దీనికున్న పాపులారిటి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదనుకోండి.ఇక జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్న హైపర్ఆది జబర్ధస్త్ షోను ఎందుకు మిస్ చేసాడనే విషయానికొస్తే..




జబర్ధస్త్ షో ను హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు.ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ఆది.అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు.కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు హై రేంజ్‌లో నిలబడలేకపోయాయి.అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి,తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు.ఒక్క హైపర్ ఆది మాత్రమే కాదు మిగతా జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ల‌ కు కూడా సినిమాలు అంత‌గా క‌లిసి రాలేదు.కానీ ఈ వారం ఎపిసోడ్‌లో హైపర్ ఆది స్కిట్ లేకపోవడంతో జబర్దస్త్ షో చూసే ప్రేక్షకులు ఒకింత నిరాత్సాహానికి గురైనట్టు సోషల్ మీడియా వేదికల్లో గట్టిగానే ప్రచారం జరగుతోంది.ఐతే,జబర్ధస్త్ షోకు హైపర్ ఆది రాకపోవడానికి కారణం..



అతని టీమ్ మెంబర్స్ తో పాటుగా అమెరికాతో సహా పలు దేశాల్లో కామెడీ షో చేయడానికి వెళ్లినట్లు సమాచారం.హైపర్ ఆది స్వతహాగా రైటర్ కాబట్టి మరలా సినీ అవకాశాలు తలుపు తట్టినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.ఎందుకంటే దర్శకులకు, రచయితలకు కామెడీ టైమింగ్‌లో సలహాలు సూచనలు కూడా చేస్తాడట.మరోవైపు హైపర్ ఆది స్కిట్ లేని జబర్ధస్త్ షో ముక్కలేని మందులా తయారైందట.గతంలో కూడా హైపర్ ఆది కొన్ని రోజులు జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు తాత్కాలింగా బ్రేక్ ఇచ్చి మరలా ఎంట్రీ ఐన సంగతి తెలిసిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: