తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు గారు, లేటెస్ట్ గా రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాను నిర్మించడం జరిగింది. అయితే వారి బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాకు ఆయన తనయుడు కేఎస్ వల్లభ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి, మంచి సూపర్ హిట్ గా నిలిచి ,అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్న కనా అనే సినిమా హక్కులను కొనుగోలు చేసి, దానిని తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి పేరుతో తెరకెక్కించడం జరిగింది. రీమేక్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పేరు గాంచిన భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమిళ నటుడు శివ కార్తికేయన్ ఒక ప్రత్యేక పాత్రలో నటించగా, 

దిబు నినాన్ థామస్ సంగీతాన్ని అందించడం జరిగింది. కథ, కథనాల్లో పెద్దగా మార్పులు చేయకుండా, మన తెలుగు నేటివికి తగ్గట్లు తెరకెక్కిన ఈ సినిమా, నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి, ప్రస్తుతం సూపర్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ ని నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఆ మీట్ లో ముందుగా నిర్మాత కేఎస్ రామారావు గారు మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారితో మేము నిర్మించిన తొలి చిత్రం అభిలాష నుండి నేటి కౌసల్య కృష్ణమూర్తి సినిమా వరకు, ప్రేక్షకులు తమ సంస్థనుండి వస్తున్న ప్రతి చిత్రానికి ఎంతో ఆదరణ చూపిస్తున్నారని అన్నారు. ఇక తండ్రి, కూతుళ్ళ మధ్య అనుబంధాన్ని తెలిపేలా ఎంతో హృద్యంగా రూపొందిన ఈ సినిమాకు లభిస్తున్న ప్రేక్షకాదరణ చూస్తుంటే,1993లో మా బ్యానర్ నుండి వచ్చిన మాతృదేవోభవ సినిమా గుర్తుకు వస్తోందని, మాధవి గారు ప్రధాన పాత్ర పోషించిన ఆ సినిమాలోని తల్లి పాత్ర, అప్పట్లో ప్రేక్షకుల మనసులకు ఎంతో చేరువయిందని, 

అయితే ఇప్పుడు అదేవిధంగా కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో తండ్రి, కూతుళ్ళ మధ్య అనుబంధానికి ప్రేక్షకులు ముగ్దులవుతున్నారని అన్నారు. ఇక దర్శకుడు భీమనేని మాట్లాడుతూ, ప్రధాన పాత్రలో నటించిన ఐశ్వర్య సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని, అలానే రాజేంద్ర ప్రసాద్ గారు, శివ కార్తికేయన్ సహా సినిమాలోని నటులు మరియు సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఈ సినిమా, నేడు విపరీతమైన ప్రేక్షకాదరణతో ముందుకు సాగడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: