సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మొదటి చిత్రం 'ఒరు ఆధార్ లవ్', 'లవర్స్ డే' పేరుతో తెలుగులో విడుదల అయినా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఈ అమ్మడికి మొదట్లో కొన్ని ఆఫర్లు వచ్చినా.. అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసింది. దాంతో వచ్చిన ఆఫర్లు కాస్త దూరమైపోయాయి. ఇక ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో ఇక ఆమె ఆశలకు బ్రేకులు పడ్డాయి. దాంతో ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడింది. మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వండి అని గత కొన్ని నెలలుగా అందర్నీ అడుగుతుంది. తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా ప్రియా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య 'నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని విజయ్ గురించి ప్రియా పోస్ట్ కూడా చేసింది. అందుకే విజయ్ దేవరకొండ, పూరిని అడిగి మరి అమ్మడికి అవకాశం ఇప్పించాడట. పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోనే విజయ్ సరసన ప్రియా ప్రకాష్ నటించనుంది. త్వరలోనే ఈ వార్తకు సంబంధించి చిత్రబృందం అధికారకంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో 'ఫైటర్' అనే కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
మరి ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారు.. అలాగే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా కూడా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపధ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి. ఇక ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు. అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుంది. ఎలాగూ దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే. మరి పూరి సినిమాతోనైనా ప్రియా ప్రకాష్ కి భారీ హిట్ వస్తోందేమో చూడాలి.