కింగ్ నాగార్జున హీరోగా చిలసౌ ఫేమ్ రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా మన్మథుడు 2. మన్మథుడు వంటి సూపర్ హిట్ సినిమా టైటిల్ తో వచ్చిన పార్ట్ 2 ఫలితం గురించి అందరికి తెలిసిందే. మన్మథుడు 2 ఫెయిల్యూర్ కు కారణం ఎవరన్నది పక్కన పెడితే ఈ సినిమా ఎఫెక్ట్ డైరక్టర్ రాహుల్ మీద ఎక్కువ పడుతుందని భావిస్తున్నారు.


చిలసౌ లాంటి మంచి సినిమా తీసిన దర్శకుడు మన్మథుడు 2 ఇంత ఘోరంగా తీస్తాడా అనుకున్నారు. అయితే మన్మథుడు 2 ఓటమి భారమంతా నాగార్జున తన మీద వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉంటే మన్మథుడు 2 తర్వాత రాహుల్ రవింద్రన్ నాచురల్ స్టార్ నానితో సినిమా చేస్తాడని అంటున్నారు.


రీసెంట్ గా నానిని కలిసిన రాహుల్ ఓ కథ వినిపించాడట. అతను చెప్పిన కథ నానికి నచ్చడంతో నాని ఆ ప్రాజెక్ట్ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీతి సింగ్ ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. రకుల్ మన్మథుడు 2లో కూడా నటించింది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ షోకి మంచి మార్కులే పడ్డాయి. తెలుగులో ప్రస్తుతం కెరియర్ అంత ఆశాజనకంగా లేకున్నా రకుల్ కు వచ్చిన అరకొర అవకాశాలనే చేస్తుంది.


అయితే నానితో సినిమా చేసి మళ్లీ కెరియర్ లో మంచి ఫాం లోకి రావాలని చూస్తుంది రకుల్. నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఆల్రెడీ వి సినిమా సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత రాహుల్ సినిమా ఉండొచ్చని అంటున్నారు. ఈ ఇయర్ జెర్సీతో హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్ తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: