నందమూరి సీనియర్ స్టార్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఆశలను నెరవేరుస్తాడా?  అపుడు మిస్ చేసుకున్న యంగ్ టైగర్ టైటిల్ బాలయ్య ఈ సారైనా వాడుకుంటాడా..? కలిసొచ్చిన ముద్దుగుమ్మతో మరోసారి సక్సెస్ పట్టబోతున్నాడా? 


ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న బాలయ్య మళ్లీ స్పీడ్ పెంచాడు. కొత్త సినిమాను అనౌన్స్ చేసి నెల దాటలేదు.. అపుడే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడట. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య మరోసారి నటిస్తున్నా కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రెండేళ్ల కిందట ఇదే కాంబినేషన్ లో వచ్చిన జైసింహా కమర్షియల్ సేఫ్ అయింది. ఇపుడు చేస్తున్న కొత్త సినిమా కోసం ఓ పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నారట. 


బాలయ్య కొత్త చిత్రానికి రూలర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఎన్టీఆర్ దమ్ము సినిమాలోని రూలర్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ టైటిల్ అయితే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ కూడా ఆశపడుతున్నారట. గతంలో బాలయ్య ఈ టైటిల్ ను తన సినిమాకు పెట్టుకోవాలని ప్లాన్ చేశాడు. ఎందుకో కానీ అపుడు కుదరలేదు. మరి ఈ సారైనా యంగ్ టైగర్ రూలర్ సాంగ్ ని బాలయ్య తన సినిమా టైటిల్ గా వాడుకుంటాడా లేదా అనేది చూడాలి. 


ఇటీవల బాలయ్య కొత్త సినిమాకు సంబంధించిన ఐరన్ మ్యాన్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ నమిత నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతుందట. బాలయ్య, సోనాల్ చౌహాన్ ఇంతకుముందు లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మూడునెలల్లో పూర్తి చేయాలని బాలయ్య టార్గెట్ గా పెట్టుకున్నాడట.  మరి బాలకృష్ణ  అభిమానులను మెప్పిస్తాడో లేదో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: