విజయ్ దేవరకొడ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఛార్మి, పూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. అయితే ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.


టైటిల్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా పూరి సూపర్ హిట్ మూవీ అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సీక్వల్ కథతో వస్తుందని అంటున్నారు. అయితే కేవలం టైటిల్ ఫైటర్ అయినంత మాత్రాన పూరి తన సినిమాకు సీక్వల్ చేస్తాడని చెప్పలేం. సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడట. దీనికోసం స్పెషల్ వర్క్ అవుట్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 


డియర్ కామ్రేడ్ సినిమా ఆశించిన ఫలితాన్న్ అందివ్వలేదు. అందుకే విజయ్ దేవరకొండ పూరిని నమ్ముకున్నాడు. పూరి ఫైటర్ తో తను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


ఇస్మార్ట్ శంకర్ తో పూరి మళ్లీ తన సత్తా చాటుకున్నాడు. రాం కెరియర్ లోనే ఇస్మార్ట్ శంకర్ సెన్సేషనల్ హిట్ అవగా ఫైటర్ తో విజయ్ కు అదిరిపోయే హిట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ హిట్ వచ్చింది కదా అని రిలాక్స్ అవకుండా విజయ్ దేవరకొండతో కూడా హిట్టు కొట్టి చూపించాలని కసి మీద ఉన్నాడు పూరి. క్రాంతి మాధవ్ సినిమా పూర్తి కాగానే విజయ్ పూరి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నే రిపీట్ చేయబోతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: