సంచలనాలకి మారు పేరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . ఆయన ఏది చేసినా సంచలనమే! ఆయన చేసే ప్రతీ పని వెనక అలాంటిది ఉండాలని కోరుకుంటారు. అటువంటి వర్మ ఇప్పుడు కులాల మీద సినిమా తీస్తున్నానని చెప్పాడు. ఆ సినిమాకి "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" అని పేరు కూడా పెట్టాడు. దాన్ని మరింత ప్రమోట్ చేయడానికి ఈ రోజు కులాల మీద రాసిన పాటని కూడా విడుదల చేశాడు. 


ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఈ పాట రిలీజ్ చేసి మరింత వేడి పుట్టించాడు. అయితే తను రిలీజ్ చేసిన పాటలో కమ్మలు, కాపులు, రెడ్లు, వైశ్యులు, బ్రాహ్మాణులు అంటూ సాగుతుంది. అంతేకాకుండా ఆ కులాలకి చెందిన రాజకీయ నాయకుల ఫోటోలు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే దీనిలోకి ప్రభాస్ ని లాగడం ఎంతవరకు కరెక్టో అర్థం కావట్లేదు.


ప్రస్తుతం దేశం మొత్తం "సాహో" ఫీవర్ తో ఊగిపోతుంది కాబట్టి దాన్ని ఈ విధంగా క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ పాటలోని లిరిక్స్ ని గమనిస్తే, నేను, నా ఫ్యామిలీ, నా దేశం అనుకున్నప్పుడు నా కులం అనుకోవడంలో తప్పేముంది అంటాడు. అలాగే భిన్నత్వంలో ఏకత్వం అయినా మనదేశంలో కులం పేరు చెప్తే ప్రాబ్లమ్ ఏముంది. అది తప్పు ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తాడు.


పాటలో ఎక్కడా కూడా ఆ కులం తక్కువ, ఈ కులం ఎక్కువ అనే ప్రస్తావన తీసుకు రాలేదు. ఈ  విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు. నాది ఈ కులం, నీది ఏ కులం అని అడగడంలో తప్పు లేకపోవచ్చు కానీ ఫలానా కులం కాబట్టి నేను ఎక్కువ. నువ్వు తక్కువ అనుకుంటూనే తప్పవుతుంది. వర్మ ఇలాంటి తప్పు ఎక్కడా చేసినట్టు కన్పించలేదు. కానీ ఒకరకంగా కులాల గురించి మాట్లాడుకునే వాళ్ళని రెచ్చగొట్టినట్టే అవుతుంది. చివర్లో ఇంత లాజిక్ గా చెప్పినా అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోవాలని ఇష్టం మీకు లేనట్టే అని ముగిస్తాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: