టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్న ‘సాహూ’ ఈ నెల 30 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.  ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన పోస్టర్లు, టీజర్, లిరిక్స్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. సాహూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ప్రభాస్, శ్రద్దా కపూర్ బాలీవుడ్, శాండిల్ వుడ్ లో ప్రమోషన్ బిజీలో ఉన్నారు. 

సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన 'సాహో' 30వ తేదీన విడుదలకు సిద్ధం కాగా, ఇప్పటికే సెన్సార్ పూర్తయింది. 2.51 గంటల నిడివి వున్న మూవీ అదిరిపోయిందని యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు వరుస ట్వీట్లు పెట్టారు. గతంలో ఆయన స్టార్ హీరోల సినిమాలకు కొన్ని రోజులకు ముందే రివ్యూలు ఇవ్వడం చూశాం. ఈ సినిమా ఫస్టాఫ్ తర్వాత వచ్చే సన్నివేశాలు చూస్తుంటే పిచ్చేక్కి పోతారని..అసలు మనం తెలుగు సినిమా చూస్తున్నామా..హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అన్నంత సంబ్రమాశ్చర్యాలతో గురి అవుతామని ఆయన అన్నారు.

ఒక రకంగా చెప్పాలంటే.. ప్రభాస్ ఎంట్రీతోనే సినిమాకు పెట్టిన డబ్బులు వచ్చేస్తాయని అన్నారు. యాక్షన్ సీన్స్, ఛేజింగ్ లు మతి పోగొట్టేలా ఉన్నాయని, ఈ పాత్రలో ప్రభాస్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని అన్నారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ ప్రభాస్ అందుకుంటాడా? అన్నవారికి ఈ మూవీ మంచి సమాధానం చెబుతుందని అన్నారు. ఈ సినిమా సాలిడ్ ఎంటర్‌ టెయినర్ అని, అభిమానులకు కావాల్సినదానికన్నా ఎక్కువ వినోదమే ఉందని అన్నారు. గత రికార్డులను కొల్లగొట్టే బ్లాక్‌ బస్టర్ అంటూ పొగడ్తలు కురిపించారు.

మరోవైపు ఉమైర్ సంధు రివ్యూలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఆ మద్య ఈయన ఇచ్చిన రివ్యూలో అంచనాలకు ఏమాత్రం అందుకోలేక పోయాయని, దారుణమైన ఫ్లాపులు అయ్యాయని అంటున్నారు. ఏది ఏమైనా 30 తర్వాత వచ్చే రివ్యూలు ఏ రేంజ్ ఉంటాయో..ప్రభాస్ భవితవ్యం ఎలా ఉండబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: