ఇల్లీ బాబీ అంటే యూత్ కి అదోరకం క్రేజ్. ఆమె నాభీ సౌందర్యం చూసి కిర్రెక్కని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ పైన వంపులు సొంపులతో కొంప ముంచే సౌందర్య రాశి ఇలియానా. దేవదాస్ మూవీతో టాలీవుడోకి  ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ ఇక్కడ పోకిరితో పెద్ద హిట్ కొట్టింది. రవితేజ తో కిక్ చేసి యమ కిక్కుతో పెద్ద  ర‌చ్చే చేసింది. ఆనక నెమ్మదిగా బాలీవుడ్ వెళ్ళి అక్కడే సెటిల్ అయిన ఈ అమ్మడు మూవీతో పాటు ప్రేమాయాణాలు కూడా బాగానే చేసిందని రూమర్స్ ఉన్నాయి.


ఇక ఇలియానాకు విదేశీ ప్రేమికుడు ఉన్నాడు. అతని పేరు ఆండ్రూ. ఆయన్ని తన హబ్బీగా చెప్పుకునే ఇలియానా ఇన్స్టాగ్రాంల్లో ఇద్దరి పిక్స్ పెడుతూ తెగ హడావుడి చేస్తూ వచ్చింది. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నది  అఫీషియల్ గా తెలియకపోయినా తన బాయ్ ఫ్రెండే హస్బండ్ అని అనేక సార్లు   చెప్పిన ఇలియాన రెండేళ్ల పాటు అతనితోనే రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తూ వచ్చింది.


ఇపుడు సడన్ గా ఆ రిలేషన్ షిప్ కి బ్రేకప్ అయిన‌ట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. ఇలియానా తన ఇన్స్టాగ్రాం ఖాతాలో నుంచి అండ్రూస్ పిక్స్ రిమూవ్ చేయడంతో అందరికీ పెద్ద డౌట్లు వస్తున్నాయి. ఇలియానా ఎందుకిలా చేసిందన్నది తేలకపోయినప్పటికీ ఇలీ బేబీ మాత్రం ఇపుడు సింగిల్ అన్నది మాత్రం ఇన్స్టాగ్రాం పిక్స్ బట్టి అర్ధమవుతోంది.


మరి ఇద్దరి మధ్యన ఏ గొడవలు వచ్చాయో, ఎందుకు విడిపోయరో తెలియడం లేదు. ఇదిలా ఉండగా ఇల్లీ బేబీకి చేతిలో ఇపుడు సినిమాలు కూడా లేవు. తెలుగులో ఆమె చేసిన లాస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంతోనీ. ఈ మూవీ తరువాత ఆమె ఎక్కద సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. మొత్తం మీద చూస్తే ఇల్లీ బేబీ బ్రేకప్ మాత్రం బాలీవుడ్లో పెద్ద చర్చగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: