అర్జున్ రెడ్డి సినిమాతో డెబ్యూ మూవీనే సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ ఆ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. అర్జున్ రెడ్డి హిందిలో కబీర్ సింగ్ అని తీసి అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. బాలీవుడ్ కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ హీరోగా చేశాడు. కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఆ సినిమా బాలీవుడ్ లో సత్తా చాటింది.


తెలుగు దర్శకుడిగా సందీప్ వంగ బాలీవుడ్ లో హిట్ అందుకోగా అక్కడే అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు సందీప్ వంగ బాటలోనే జెర్సీ డైరక్టర్ గౌతం తిన్ననూరి కూడా వెళ్తున్నాడు. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు దిల్ రాజు.


బాలీవుడ్ లో ఈ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా గౌతం తిన్ననూరి అందుకున్నాడట. సందీప్ వంగతో పాటుగా గౌతం తిన్ననూరి కూడా అక్కడే కెరియర్ కొనసాగించాలని చూస్తున్నాడు. జెర్సీ సినిమా బాలీవుడ్ లో కూడా తప్పకుండా హిట్ అయ్యే సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అయితే హిందిలో జెర్సీ రీమేక్ లో హీరోగా ఎవరు చేస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.   


నాని, శ్రద్ధా శ్రీనాథ్ కలిసి నటించిన జెర్సీ సినిమా తెలుగులో నాని ఖాతాలో మరో హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను తమిళంలో కూడా రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. తమిళంలో ఈ సినిమా రీమేక్ లో ధనుష్ నటిస్తాడని అంటున్నారు. మొత్తానికి ఈమధ్య తెలుగు సినిమాలు అటు బాలీవుడ్, కోలీవుడ్ లలో రీమేక్ అవుతున్నాయి. ఇలాంటి సినిమాలు తెలుగులో హిట్ అవడమే కాకుండా రీమేక్ రైట్స్ రూపంలో కూడా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: