సంకల్ప్ రెడ్డి తెలుగులో రెండు వరుస హిట్ సినిమాలకు దర్శకత్వం వహించడు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఘాజీ. టాలీవుడ్ హంక్ రానా హిరోగా నటించిన ఈ సినిమా 1971లో జరిగిన ఇండియా పాకిస్థాన్ సబ్ మెరైన్ యుద్దం ఆదారంగా రూపోందించబడింది.తెలుగు ,తమిళ మరియు హీంది భాషల్లో రిలీజ్ అయిన ఘాజీ ఘనవిజయం సాధించింది.ఘాజి సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు విభాగంలో నేషనల్ అవార్డు వచ్చింది.
సంకల్ప్ రెడ్డి తరువాత వరుణ్ తేజ హీరోగా వచ్చినా"  అంతారిక్షం 9000 km" సినిమా కు దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకు మంచి ఆదారణ లభించింది.ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి తన మొదటి బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు అన్న విషయం తెలిసిందే .ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయింది.ఈ సినిమాకు నటీనటులు మరుయు సంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో బిజి గా ఉన్నారు.

అయితే అయనకు సంబందించిన ఒక హట్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.సంకల్ప్ రెడ్డి గత సంవత్సరం హిందిలో సంచలన విజయం సాధించిన "లస్ట్ స్టోరీస్" ని తెలుగు లో రీమోక్ చేయబోతున్నాడు . ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకుల  కోసం మాత్రమే.ఈ సినిమాలో నాలుగు భాగాలు ఉంటాయి.లస్ట్ స్టోరీస్ ని హీందిలో అనురాగ్ కశ్యప్, కరన్ జోహర్,జోయా అక్తర్, మరియు దిబాకర్ బెనర్జీ లు దర్సకత్వం వహించారు..ఇందులో భారత్ అనే నేను ఫేం కియారా అద్వానీ.విక్కి కౌశల్,మనీషా కోయిరాలా,భూమి పడ్నేకర్ మరియు రాధికా ఆప్టే లు ప్రధాన పాత్రల్లో నటించారు.

హిందిలో వర్షన్ ను నిర్మించిన RSA ప్రొడక్షన్ హౌస్  తెలుగులోనూ నిర్మించనుంది.ఈ  లస్ట్ స్టోరీస్ తెలుగు వర్షన్  వచ్చే సంవత్సరం మార్చి లో విడుదల అవుతుంది.సంకల్ప్ రెడ్డి ఒక భాగానికి మాత్రమే దర్శకత్వం వహించనున్నాడు. మిగుతా ముగ్గురు డైరెక్టర్స్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంత నచ్చుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: