నాచురల్ స్టార్ నాని విక్రం కె కుమార్ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తున్న సినిమా గ్యాన్ లీడర్. అసలు ఆ టైటిల్ వినగానే మెగాస్టార్ చిరంజీవి గుర్తుకొస్తారు. గ్యాంగ్ లీడర్ నాని టైటిల్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మెగా ఫ్యాన్స్ నుండి కొంత వ్యతిరేకత వచ్చింది కాని అవన్ని సర్ధుకునేలా చేశారు. ఇక ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా చేశారు. 


ట్రైలర్ లో నాని ఓ రివెంజ్ స్టోరీ రైటర్.. అతని గురించి తెలుసుకుని తమకు ఉన్న రివెంజ్ ను తీర్చుకునేందుకు ఓ ఆడవాళ్ల గ్యాంగ్ హీరో దగ్గరకు వస్తారు. వాళ్ల కథ విన్న హీరో వారికి హెల్ప్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అలా ఆడవాళ్ల గ్యాంగ్ కు లీడర్ గా నాని గ్యాంగ్ లీడర్ అవుతాడు. ట్రైలర్ చూస్తే సినిమా మెప్పించేలా ఉందని చెప్పొచ్చు.


ఇక స్పెషల్ ఎట్రాక్షన్ గా సినిమాలో విలన్ గా కార్తికేయ నటించడం కూడా బాగా కుదిరింది. యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే సెట్ రైట్ అవుతున్నట్టు ఉన్న కార్తికేయ సడెన్ గా విలన్ అవతారం ఎత్తడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నాని సినిమాలో విలన్ గా అయినా తనకు మంచి పేరు వస్తుందని భావించి ఈ సినిమా చేశాడు కార్తికేయ.


గ్యాంగ్ లీడర్ ట్రైలర్ లో నాని ఒకసారి చిరు ఫోటోతో కనిపించాడు. అంతేకాదు గ్యాంగ్ లీడర్ లో చిరు స్టిల్ ఒకటి యాజిటీజ్ దించాడు. మొత్తానికి ఈ గ్యాంగ్ లీడర్ టైటిల్ వాడినందుకు మెగా ఫ్యాన్స్ కు నాని గొప్ప గిఫ్ట్ ఇచ్చినట్టు ఉన్నాడు. సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: