ఈ రోజుల్లో పెళ్లి అయినా ప్రేమ అయినా ఆ బంధం అనేది ఆ మ‌నిషి ఉన్నంత వ‌ర‌కే ఉంట‌ది. అలాంటిది ఆ మ‌నిషి చ‌నిపోయినా కూడా త‌న వెంటే త‌న జ్ఞాప‌కాల‌ను నెమ‌ర‌వేసుకుంటూ బ్ర‌తికేయ‌డ‌మంటే అది కేవ‌లం సినిమాల్లోనే  ఉంటుంది. బ‌య‌ట అలాంటివారు ఎక్క‌డోగాని ఉండ‌రు. అలా ప్రేమించేవారు కూడా చాలా అరుదుగా ఉంటారు. కాని ఆమె చ‌నిపోయినా కూడా ప్ర‌తి నిమిషం ఆమె జ్ఞాప‌కాల్లో బ్ర‌తికుతూ ఆమెను మ‌ర్చిపోలేక ఆమె ప్ర‌తి సంఘ‌ట‌న‌ను గుర్తుచేసుకుంటూ త‌న వెంటే ఉంటున్న‌ట్టు ఊహించుకోవ‌డం అనేది చాలా క‌ష్టం. అలాంటి ఓ జంట గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌,  లెజండ‌రీ డైరెక్ట‌ర్ అండ్ యాక్ట‌ర్ విజ‌య‌నిర్మ‌ల ఒక‌ర‌కంగా చెప్పాలంటే వీరిద్దరూ ఎన్న‌డూ ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండేవారు కాదు. కృష్ణ ఎక్క‌డికి వెళ్ళినా విజ‌య‌నిర్మ‌ల వెంట‌లేనిదే వెళ్లేవారుకాదు. ఆమె అంటే ఆయ‌న‌కు అంత ప్రేమ‌. ఆమె చ‌నిపోయినా కూడా ఆయ‌న ఆమె ఇంట్లోనే నానాక‌రామ‌గూడలో ఆమె స్వ‌గృహంలోనే ఆ జ్ఞాప‌కాల‌ను త‌లుచుకుంటూ త‌న‌వెంటే ఉన్న‌ట్లు ఉంటున్నారు. ఆయ‌న ఇంట్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కాసేపు అలా సోఫాలో కూర్చుంటే ఆమె కూడా ఆయ‌న‌తో పాటు వ‌చ్చి త‌న ప‌క్క‌న కూర్చుని ఆయ‌న‌కు క‌బుర్లు చెబుతున్న‌ట్లు  ఆయ‌న‌ ఇప్ప‌టికీ ఆమె లేకుండా ఆ బ‌య‌ట‌కు వ‌చ్చి సోఫాలో కూర్చోవ‌డం లేదు. అంటే ఇప్పుడు అమె  ఈ లోకంలో లేదు క‌దా ఎలా వ‌స్తుంది  అని అనుకుంటున్నారా. ఇప్ప‌టికీ ఆమె ఆయ‌న వెంటే ఉన్నారు. కృష్ణ‌గారు సోఫాలో కూర్చోగానే ఆయ‌న ప‌క్క‌న ఉన్న కుర్చీలో ఆమె ఫొటో పెట్టి ఆమె త‌న ప‌క్క‌న ఉన్న‌ట్లు భావించి ఎంతో ఆనందంగా ఆయ‌న అలా ఆమెను చూసుకుంటే కూర్చుంటారు. ఈ రోజుల్లో ఇలాంటి అమ‌ర‌ప్రేమికులు ఎక్క‌డైనా ఉంటారా. ఉన్నా  అస‌లు అవ‌న్నీ ప‌ట్టించుకుంటారా. తోడునీడ‌గా ఉంటాన‌ని పెద్ద‌ల‌ముందు ఎలా అయితే కృష్ణ విజ‌య‌నిర్మ‌ల‌కు వాగ్దానం చేశాడో. ఇప్ప‌టికీ అలాగే ఉన్నాడ‌నేందుకు ఈ ఫొటోనే నిద‌ర్శ‌నం.


సూపర్ స్టార్ కృష్ణ.. 1965లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘తేనే మనసులు’ సినిమాలో వెండితెరకు పరిచయం అయ్యారు. అంతకు ముందే 1961లో కృష్ణకు ఆయన మరదలు ఇందిరాతో పెళ్లైయింది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో మొదటిసారి కృష్ణ,విజయ నిర్మల కలిసి నటించారు. ఆ సినిమా సాక్షిగా వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. కృష్ణ..విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తిరుపతిలో కేవలం నలుగురి సాక్షుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.  కృష్ణ గారు తన ఇద్దరు భార్యలతో ఎంతో ప్రేమగా ఉండేవారని చెప్పుకొచ్చారు.  కృష్ణ కూడా విజయ నిర్మలను పెళ్లి చేసుకునే ముందే కృష్ణకు ఇద్దరు పిల్లలు రమేష్ బాబు, పద్మావతి  ఉన్నారు. విజయ నిర్మలతో పెళ్లి తర్వాత  కూడా ఇందిరా.. మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని ముగ్గురు బిడ్డ‌లు వీరికి క‌లిగారు.


ఎక్కువ చిత్రాల్లో జంటగా నటించిన కృష్ణ.. విజయనిర్మలది హిట్ పెయిర్ గా అనుకునేవారు. ఇలాంటి పెయిర్స్ సినిమా ఇండస్ట్రీలో చాలానే ఉంటాయి. అయితే.. రీల్ లైఫ్ లో హిట్ అయినా.. రియల్ లైఫ్ లో ఎవరికి వారే అన్నట్లు ఉంటారు. ఇందుకు మినహాయింపుగా కృష్ణ.. విజయనిర్మలను చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: